నిరుద్యోగులకు అవకాశాలు లేవు.. రైతులకు రుణమాఫీ జరగదు.. ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసిన షర్మిల..
Sharmila comments : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల
Sharmila comments: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏక మొత్తంలో రుణమాఫీ చేశాడన్నారు. పేదల కోసం 108 అంబులెన్స్‌ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన హయాంలో పేదలకు 46 లక్షల ఇండ్లు కట్టించి ఆదుకున్నాడని పేర్కొన్నారు. యువతకు 11 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతులకు రుణ మాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాడలేడన్నారు. రాష్ట్రంలో 54 లక్షల నిరుద్యోగులు ఉన్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తాం లేకుంటే భృతి ఇస్తామని చెప్పిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. యువత ఉద్యోగాలు లేక చేసుకుంటేన్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం పోలీసులతో మాపై దాడిచేయిస్తున్నారన్నారు.
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల ప్రాంత వాసి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించని ఆయన ఒక మంత్రా అంటూ మండిపడ్డారు. ఏడేండ్లలో ఏడు వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముందు నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వు తర్వాత ప్రజల వద్దకు రా లేదంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటామని సమస్యల కోసం పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు.