AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRTP: రంగు పడుద్దా.. లేదా.. అయ్యో.. కొత్తగా ఆ పార్టీ రంగు కూడా అదేనా.. తెలంగాణ పార్టీలకు కలిసిరాని పాలపిట్ట రంగు..

ఓ రంగు మీద రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో కొత్తగా మరో పార్టీ పుట్టుకొచ్చింది. మరి ఆ పార్టీ భవిష్యత్ ఏంటి? అంతలా టెన్షన్ పెడుతున్న ఆ కలర్ ఏంటి?

YSRTP: రంగు పడుద్దా.. లేదా.. అయ్యో.. కొత్తగా ఆ పార్టీ రంగు కూడా అదేనా.. తెలంగాణ పార్టీలకు కలిసిరాని పాలపిట్ట రంగు..
Ys Sharmila Party
Sanjay Kasula
|

Updated on: Aug 03, 2021 | 6:16 PM

Share

ఓ రంగు మీద రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జెండాలో ఆ రంగు పెట్టుకున్న ఒక పార్టీ మొత్తానికే కనుమరుగు అయింది. మరో పార్టీకి సక్సెస్ లేక మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అదే కలర్ తో తెలంగాణలో కొత్తగా మరో పార్టీ పుట్టుకొచ్చింది. మరి ఆ పార్టీ భవిష్యత్ ఏంటి? అంతలా టెన్షన్ పెడుతున్న ఆ కలర్ ఏంటి?

తెలంగాణలో దసరా రోజు అందరూ వెతికి మరీ పట్టుకునే పాలపిట్ట ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది. పాలపిట్ట రంగుతో పోలిన జెండాలు పెట్టుకుంటున్న కొన్ని రాజకీయ పార్టీలకు ఉమ్మడి రాష్ట్ర నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు కలసి రావడం లేదని తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్.. 2008లో నవ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టారు. అనతి కాలంలోనే ఆయన పార్టీ కనుమరుగైంది.

Nava Telangana Party

Nava Telangana Party

అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో నవతెలంగాణ ప్రజా పార్టీ విలీనమైంది. అంత వరకు బాగానే ఆ ఎపిసోడ్ ఓవర్ అయినా.. నవ తెలంగాణ పార్టీ రంగు పాలపిట్ట రంగు అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం.

Praja Rajam

Praja Rajam

ప్రొఫెసర్ కోదండరాం కూడా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణ జన సమితి పేరుతో ఏర్పాటైన ఈ పార్టీ జెండాలోనూ పాలపిట్ట రంగు ఉంటుంది. అయితే పార్టీ పెట్టిన రోజు నుంచి నేటి వరకు ఆ పార్టీకి సక్సెస్ అనేది లేదు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కోదండరాంకి కూడా విజయం దక్కలేదు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. కోదండరాంను ఓటమే పలకరించింది. టీజేఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తారనే పుకార్లు కూడా రాజకీయ సర్కిల్స్ లో షికార్లు కొడుతున్నాయి.

Tjs

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ YSRTP పేరుతో కొత్త పార్టీని తీసుకొచ్చారు. అయితే ఈ పార్టీ జెండాలో కూడా పాల పిట్ట రంగు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Ys Sharmila Party

Ys Sharmila Party

ఈ రంగుతో ఉన్న పార్టీల భవిష్యత్ చూస్తే రానున్న రోజుల్లో షర్మిల పార్టీ పరిస్థితి ఏంటా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి.

రిపోర్టర్.. శ్రీధర్ ప్రసాద్

ఇవి కూడా చదవండి: Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..

PayDay Loan: మీకు శాలరీ రావడం ఆలస్యమవుతోందా.. రూ.లక్ష కావాలా.. కేవలం నెల రోజుల కోసం ఈ బ్యాంక్‌లో పే డే లోన్