Hyderabad: పోలీసులకు తలనొప్పిగా మారిన కేబుల్ బ్రిడ్జి.. ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్న అధికారులు
Hyderabad News: దుర్గం చెరువు బ్రిడ్జి ఇప్పుడు సూసైడ్ స్పాట్‌కి అడ్డాగా మారింది. గత కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న ప్రమాదలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్న అవి పెద్దగా ఫలితం ఉండటం లేదు. దీంతో ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం...
హైదరాబాద్, జులై 24: దుర్గం చెరువు బ్రిడ్జి ఇప్పుడు సూసైడ్ స్పాట్‌కి అడ్డాగా మారింది. గత కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న ప్రమాదలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్న అవి పెద్దగా ఫలితం ఉండటం లేదు. దీంతో ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చూసేందుకు రోజు వందల మంది వస్తుంటారు.
పుట్టిన రోజు మొదలు ఇతర ఈవెంట్‌లను కేబుల్ బ్రిడ్జిపై జరుపుకునేందుకు యూత్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఆత్మహత్య చేసుకోవాలనే వారికి బ్రిడ్జి సులువుగా ఉంది. నీటిలో దూకిన వారిని కాపాడటం కూడా అసాధ్యం. ఈ ఆత్మహత్యలు నిరోధించడానికి పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. 24 గంటల పాటు కేబుల్ బ్రిడ్జి పై నిఘా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జిపై అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల కదలికల పై నిఘా పెట్టనున్నారు. ఎక్కువ సేపు వచ్చి బ్రిడ్జి పరిసరాల్లో ఉంటే పంపించేలా ప్రణాళిక చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వార కంట్రోల్ రూమ్‌లో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.
నీటి మధ్యలో బోట్స్‌తో తరుచుగా రౌండ్స్ వేయనున్నారు. బ్రిడ్జిపై నుండి నీటిలో దుకాకుండా జీహెచ్‌ఎమ్‌సీతో పాటు ఇంజన్5 సిబ్బందితో సంప్రదిస్తున్నారు. బ్రిడ్జి పై నుంచి దుకాకుండా ఉండేలా నివారణ చర్యలపై కసరత్తు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చెరువు మధ్యలో ఉండటంతో సూసైడ్‌కు అడ్డాగా మారింది. నివారణ చర్యలు చేపట్టి బ్రిడ్జి పై ఇక ఆత్మహత్యలు జరగకండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కేబుల్ బ్రిడ్జిపై పటిష్ట చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు పోలీసులు. పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..