Hyderabad: బోనాల వేడుకల్లో భగ్గుమన్న భాగ్యనగరం.. భారీగా పోలీస్ కేసులు నమోదు
బోనాల పండుగ రోజు పగలు ప్రతికారాలతో భాగ్యనగరం భగ్గుమంది. జూబ్లీహిల్స్, తార్నాక, పాతబస్తీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మందికి గాయాలు అయ్యాయి. కొన్ని చోట్ల కత్తులతో మరి కొన్ని చోట్ల కర్రలతో దాడులు చేసుకున్నారు. తార్నాక, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ తో పాటు పాతబస్తీలో జరిగిన..
బోనాల పండగ అంటే.. అమ్మవారికి బోనం సమర్పించడం. ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని కోరుకోవడం. ఇలా భక్తి పారవశ్యం నిండిన మనసుతో అమ్మవారి గుడికి వెళ్తుంటారు అందరు. కానీ కొందరు మాత్రం.. పగలు, ప్రతికారాలు తీర్చుకోవడం కోసం వెళ్తుంటారు. అదేంటి.. అమ్మవారి గుడికి పగల కోసం ఎందుకు వెళ్తారు అనే అనుమానం వస్తుందా? అయితే వివరాల్లోకి వెళదాం రండి.. బోనాల పండుగ రోజు పగలు ప్రతికారాలతో భాగ్యనగరం భగ్గుమంది. జూబ్లీహిల్స్, తార్నాక, పాతబస్తీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మందికి గాయాలు అయ్యాయి. కొన్ని చోట్ల కత్తులతో మరి కొన్ని చోట్ల కర్రలతో దాడులు చేసుకున్నారు. తార్నాక, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ తో పాటు పాతబస్తీలో జరిగిన దాడుల్లో అనేక మంది తీవ్ర గాయాలు అయ్యాయి. బోనాల వేడుకల సందర్భంగా ముందస్తుగా మద్యం షాప్ లు మూసివేసిన గొడవలు తగ్గకపోగా ఈ ఏడాది మరింత పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో నే బోనాల వేడుక సందర్భంగా ఘర్షణలు తలెత్తినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 57 మంది పై 307 అట్టెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు చేయడంతో వీరంతా చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 57మంది పై మర్డర్ కేసు నమోదు చేయడంతో వీరికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువే. దీంతో వీరంతా ఓ రెండు నెలలపాటు జైలు లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ఏడాది బోనాల సందర్భంగా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ ఎప్పుడు లేని విధంగా ఏ సారి రికార్డ్ స్థాయిలో 307 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యాయి అంటున్నారు అధికారులు. వీరి బెయిల్ పై బయటకి వచ్చిన వీరి కదలికల పై నిఘా ఉందంటున్నారు అధికారులు. అవసరం అయితే ఎన్నికల సమయంలో వీరందరిని బైండోవర్ చేస్తామంటున్నారు అధికారులు
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..