Hyderabad Rains: హైదరాబాదీలు ఎక్కడున్నా వెంటనే ఇంటికి వెళ్లిపోండి.. ఈ రాత్రికి కుండపోత తప్పదు.
వాతావరణ శాఖ హైదరాబాదీలను అలర్ట్ చేసింది. రానున్న గంటలో నగరంలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలుచోట్ట వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అమీర్‌పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కోఠి, పంజాగుట్ట, ఎర్రగడ్డలో వర్షం మొదలైంది....
వాతావరణ శాఖ హైదరాబాదీలను అలర్ట్ చేసింది. రానున్న గంటలో నగరంలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలుచోట్ట వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అమీర్‌పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కోఠి, పంజాగుట్ట, ఎర్రగడ్డలో వర్షం మొదలైంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.
వర్షం నీరు భారీగా చేరే ప్రాంతాల్లో చర్యలు ప్రారంభించారు. సుమారు గంటపాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జనాలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. నగరంలో దాదాపు అన్ని ప్రధాన కూడళ్లలో వాహనాలు ఆగిపోయాయి. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నంలో వర్షం ఇప్పటికే ప్రారంభమైంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే వాతవారణ శాఖ అధికారులు రేపు హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. మంగళవారం నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు.
Public to note this alert & stay safely as a precautionary measure. https://t.co/0LYewRA5Xu
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 24, 2023
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..