AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: హిమాన్షు గ్రాడ్యుయేషన్‌ డే సెలబ్రేషన్స్‌.. తరలివచ్చిన సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ.. ఆకట్టుకుంటోన్న ఫొటోస్‌

గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలో హిమన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నాడు. అలాగే కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత నాయనమ్మలైన సీఎం కేసీఆర్..

CM KCR: హిమాన్షు గ్రాడ్యుయేషన్‌ డే సెలబ్రేషన్స్‌.. తరలివచ్చిన సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ.. ఆకట్టుకుంటోన్న ఫొటోస్‌
Cm Kcr Family
Basha Shek
|

Updated on: Apr 19, 2023 | 7:38 AM

Share

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సీఎం కేసీఆర్‌ కుటుంబం తరలివచ్చింది. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలో హిమన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నాడు. అలాగే కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత నాయనమ్మలైన సీఎం కేసీఆర్ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్‌ శైలిమ, చెల్లెలు అలేఖ్య, మేనమామలు రాజేందర్‌ ప్రసాద్‌ పాకాల,శైలేందర్‌ ప్రసాద్‌ పాకాల ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.  సందర్భంగా గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగివచ్చి తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పట్టా పెట్టాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక చదువుకుంటూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసింది. ఇందులో భాగంగా, సీఎం కేసీఆర్ మనుమడు హిమాంశు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను అవార్డును అందుకున్నాడు.

ఈ సందర్భంగా చిన్నతనం నుంచీ తనచేతుల్లో పెరిగి నేడు పట్టభద్రుడిగా ఎదిగిన మనవడిని చూసి సీఎం కేసీఆర్ ఉప్పొంగిపోయారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని హిమాన్షా రావును అభినందించారు. ఇక మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు సాధించిన ప్రతిభానైపుణ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మార్మోగిపోయింది. కాగా హిమాన్షు ఇటీవలే గోల్డెన్‌ అవర్‌  హిమాన్షు కవర్‌ పేరుతో ఒక పాట పాడి యూట్యూబులో షేర్‌ చేశాడు. ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..