cyber security: సైబర్ సెక్యూరిటీలో ఆన్‌లైన్‌ కోర్సులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల తీరులోనూ మార్పులు జరుగుతున్నాయి. సాంకేతిక అందుబాటులోకి వచ్చిందని సంతోషించాలో, సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే సైబర్‌ నేరాలు పెరుగుతోన్న క్రమంలోనే సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం సైతం పెరుగుతోంది...

cyber security: సైబర్ సెక్యూరిటీలో ఆన్‌లైన్‌ కోర్సులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Cyber Security
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 18, 2023 | 9:21 PM

పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల తీరులోనూ మార్పులు జరుగుతున్నాయి. సాంకేతిక అందుబాటులోకి వచ్చిందని సంతోషించాలో, సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే సైబర్‌ నేరాలు పెరుగుతోన్న క్రమంలోనే సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం సైతం పెరుగుతోంది. దీంతో సైబర్‌ సెక్యూరిటీ కోర్సులకు సైతం రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగల యువతీ, యువకుల నుంచి అప్లికేషన్స్‌ను ఆహ్వానిస్తున్నారు. సంస్థ డైరెక్టర్‌ విమలారెడ్డి ఈ విషయమై మంగళవారం విలేకర్ల సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ విభాగాల్లో ఐటీ రంగం, ఇన్మ‌ఫ‌ర్మేష‌న్ రంగం, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్‌ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల’ని తెలిపారు. పూర్తి వివరాల కోసం 7893141797 ఫోన్‌ నెంబర్‌కి సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www.nacsindia.org అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..