Delhi Liquor Scam: లిక్కర్‌ స్కాంలో మరో సంచలనం.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌.. ఢిల్లీ తరలింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక వ్యక్తిగా పరిగణిస్తోన్న హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది.

Delhi Liquor Scam: లిక్కర్‌ స్కాంలో మరో సంచలనం.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌.. ఢిల్లీ తరలింపు
Butchibabu Gorantla
Follow us
Basha Shek

|

Updated on: Feb 08, 2023 | 11:51 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక వ్యక్తిగా పరిగణిస్తోన్న హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రే అతనిని ఢిల్లీ తరలించారు. కాగా బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ ఛైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖులకు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా వ్యవహరించారు. ఆయన పేరుమీద గోరంట్ల మరియు అసోసియేట్స్, శ్రీ ఎంటర్‌ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలు ఉన్నాయి.  ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బుజ్జిబాబు నివాసంలో పలు సార్లు సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు విచారణ కోసం అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తరలించారు.

కాగా అరుణ్ రామచంద్రా పెళ్లె, ఎమ్మెల్సీ కవిత, రాబిన్ డిస్టల్లరీస్‌కు బుచ్చిబాబు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరాలను సౌత్‌ గ్రూప్‌గా చెప్తుండగా.. సౌత్ గ్రూప్ లావాదేవీలపై బుచ్చిబాబును గతంలో ప్రశ్నించింది సీబీఐ . ఇక లిక్కర్ స్కామ్‌ కేసులో ఇది ఎనిమిదో అరెస్ట్. ఇప్పటి వరకు సిబిఐ ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి వివరాలు రాబట్టింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా, బినోయ్ బాబు, అమిత్ అరోరా.. గతంలో అరెస్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే