Hetero: డబ్బులు బాబోయ్ డబ్బులు.. నోట్ల కట్టలను దాచడానికే అపార్ట్‌మెంట్‌లు కొన్నారు. హెటిరో ఐటీ సోదాల్లో..
Hetero IT Raids: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారలు సోదాల్లో బయటపడుతోన్న..
Hetero IT Raids: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారలు సోదాల్లో బయటపడుతోన్న నగదు ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు సాగుతోన్న సోదాల్లో అధికారులు రూ. వందల కోట్ల నగదును సీజ్ చేశారు. సంస్థ కార్యాలయాలతోపాటు ఫ్యాక్టరీలు, ముఖ్యమైన ఉద్యోగులు, అధికారుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి.
అధికారులు ఏకంగా రూ. 550 కోట్ల నల్ల డబ్బును గుర్తించారని సమాచారం. ఇక ఇప్పటికే రూ. 142 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇందులో భాగంగా ఓ బీరువాలో పెట్టిన డబ్బులకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ బీరువాలో ఉన్నవన్నీ రూ.500 నోట్ల కట్టలే కావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 4 రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. అక్రమ నగదును దాచడానికి పెద్ద ఎత్తున అట్టపెట్టెలను ఉపయోగించారు. మెడిసిన్‌ను నిల్వ చేస్తున్నట్లు ఎవరికీ అనుమానం రాకుండా అట్టపెట్టెల్లో ఏకంగా రూ. 142 కోట్లు దాచినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను అధికారులు సీజ్ చేశారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో అల్మారాలో ఏకంగా రూ. 5 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో బయటపడ్డ నగదును లెక్కపెట్టడానికే రెండు రోజుల సమయం పట్టిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి హెటిరో డ్రగ్స్ ఐటీ దాడుల వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా.? ఇంకా కొనసాగుతుందా చూడాలి.
Also Read: GRMB: గోదావరి నదీ జలాలపై జీఆర్‌ఎంబీ కీలక సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ నిలివేయాలంటూ తెలంగాణ పట్టు!
Viral Video: ఈ సొట్టబుగ్గల సుందరి అందానికి నెటిజన్లు ఫిదా.. నెట్టింట వీడియో ట్రెండింగ్.!