GRMB: గోదావరి నదీ జలాలపై జీఆర్‌ఎంబీ కీలక సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ నిలివేయాలంటూ తెలంగాణ పట్టు!

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం సోమవారం జరిగింది. ప్రయోగాత్మకంగా పెద్దవాగు నుంచి గెజిట్ అమలు చేస్తామని జీఆర్ఎంబీ చెప్పిందని తెలంగాణ ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ తెలిపారు.

GRMB: గోదావరి నదీ జలాలపై జీఆర్‌ఎంబీ కీలక సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ నిలివేయాలంటూ తెలంగాణ పట్టు!
Grmb Meeting
Follow us

|

Updated on: Oct 11, 2021 | 5:06 PM

GRMB Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం సోమవారం జరిగింది. ప్రయోగాత్మకంగా పెద్దవాగు నుంచి గెజిట్ అమలు చేస్తామని జీఆర్ఎంబీ చెప్పిందని తెలంగాణ ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ తెలిపారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభ్యంతర చెప్పలేదన్నారు.

హైదరాబాద్‌ జలసౌధలో జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన భేటీ జరుగింది. తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చించారు. పెద్ద వాగు ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకొనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 14 నుంచి కేంద్ర జలశక్తిశాఖ జారీ చేసిన గెజిట్‌ అమల్లోకి రానుంది. బోర్డుల పరిధిలోకి రానున్న ప్రాజెక్టులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కాగా, ఈ నెల 14 నుంచి గెజిట్‌ అమల్లోకి రానుందని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. ఇరురాష్ట్రాల అధికారులు ఆపరేషన్లు వేరువేరుగా చేసుకోవాలని బోర్డు చెప్పిందన్నారు. పెద్దవాగు విషయాన్ని ప్రభుత్వానికి చెబుతామని, సీడ్ మనీ వ్యయం విషయంలో స్పష్టత అడిగామన్నారు రజత్‌కుమార్‌. గెజిట్ నోటిఫికేషన్‌లో ఎక్కడా ప్రాజెక్టులను టేకప్ చేసుకునే విధానంలేదని, మేం ఓకే అంటే బోర్డులోకి ప్రాజెక్టులువెళ్తాయన్నారు. పెద్దవాగు విషయాన్ని ప్రభుత్వానికి చెబుతామని, సర్కార్‌ ఆమోదిస్తే GRMB పరిధికి వెళ్తాయన్నారు రజత్‌కుమార్‌.

అయితే, గెజిట్‌ అమలు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్.. కేంద్ర జలశక్తి మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారని తెలిపారు. గోదావరిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళుతుందని.. ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తారని రజత్‌కుమార్‌ చెప్పారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణకు 2వేల ఎకరాల ఆయకట్టు ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు 13వేల ఆయకట్టు ఉందని వివరించారు. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో కుదరదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్న రజత్‌కుమార్‌.. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు వెళుతుందని స్పష్టం చేశారు.

Read Also…  CM KCR: ముచ్చింతల్‌ చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి.. కుటీర ప్రాంగణంలో మొక్కలు నాటిన కేసీఆర్‌

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?