Etala Rajender: కేసీఆర్ ఎవరి మాట వినరు.. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయరు.. ఈటల షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మె్ల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బడా నాయకుల అవసరాలు తీర్చేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని ఆరోపించారు. ధరణితో తెలంగాణ..

Etala Rajender: కేసీఆర్ ఎవరి మాట వినరు.. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయరు.. ఈటల షాకింగ్ కామెంట్స్
Etala Rajender
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 29, 2022 | 1:19 PM

తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మె్ల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బడా నాయకుల అవసరాలు తీర్చేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని ఆరోపించారు. ధరణితో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందన్న ఈటల.. కేసీఆర్ చెప్పిందే వేదంలా తెలంగాణ రాష్ట్రం నడుస్తుందని మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసమే సీఎం కేసీఅర్ రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా న్యాయబద్ధమైందని, అతనికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంతో పోరాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి దీక్ష విరమించాలని ఈటల కోరారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ ధరణి సమస్య కేవలం కామారెడ్డి జిల్లా సమస్యే కాదని, రాష్ట్రంలో ఉన్న రైతులందరి సమస్య అని చెప్పారు. కాబట్టి బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆలోచించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో దేశంలోనే ధరణి మంచి ఫలితం సాధిస్తుందని ఈ పోర్టల్ తెచ్చిన సీఎం కేసీఆర్.. సుమారు 20 లక్షల దరఖాస్తులు ధరణి సమస్యలపై వచ్చాయి. ఈ పోర్టల్ ద్వారా వస్తున్న సమస్యలు చూసి ఇది వద్ద చెప్పినా పట్టించుకోలేదు. కేసీఆర్ ఎవరి మాట వినే రకం కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయరు. దేశంలోనే ఒక ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే నీచ సంస్కృతికి తెలంగాణలో తెర లేపారు. వీఆర్ఓ వ్యవస్థను తీసేసి, మెరుగైన పరిష్కారం చూపిస్తామన్న సీఎం.. వీఆర్ఓ వ్యవస్థను, రెవిన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. హైదరాబాద్ చుట్టూ వారసులు లేని భూముల వివరాలు తెప్పించుకుని ధరణి పోర్టల్ ద్వారా వేల కోట్ల సంపాదనకు ప్లాన్ చేశారు. తన భూమి ఉంటుందో పోతుందో అని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి కేసీఆర్ హయాంలో ఉంది. ధరణి పోర్టల్ కేవలం కేసీఆర్ కోసం.. ఆయన కుటుంబం కోసం.. మాత్రమే పని చేస్తోంది.

– ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి

భూమి సమస్యలపై రైతులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి తెలంగాణలో లేదని ఈటల అన్నారు. ఒక రైతు పదిసార్లు దరఖాస్తు చేస్తే రూ.10 వేలు ఖర్చవుతున్నాయని.. హైదరాబాద్ చుట్టూ 5,600 ఎకరాలు, 50 వేల కోట్ల భూములను ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను బినామీల పేరిట ఉన్న కంపెనీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే తట్టుకోలేమని, అసెంబ్లీకి వస్తే ఇవన్నింటిపై ప్రశ్నిస్తారని అక్కడికి రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.

అరెస్టులు చేస్తూ వారిని ఇంటిదగ్గరే దిగబెట్టే కొత్త సంస్కృతి మొదలైందని మండిపడ్డారు. పండగలు వస్తే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోవాలన్నా, అప్పుల కుంపటి నుంచి బయటపడాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చడమే ఇప్పుడున్న ఒకే ఒక మార్గం అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!