ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి- భట్టి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారారని.. అటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో  రాజ్యాంగ స్ఫూర్తికి సీఎం కేసీఆర్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. స్పీకర్‌ని కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశామన్న భట్టి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు […]

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి- భట్టి
Follow us

|

Updated on: Apr 14, 2019 | 2:26 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారారని.. అటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో  రాజ్యాంగ స్ఫూర్తికి సీఎం కేసీఆర్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. స్పీకర్‌ని కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశామన్న భట్టి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనామా వెంకటేశ్వర్లు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. లేఖతో పాటు 125 పేజీల పిటిషన్ ప్రతులను స్పీకర్‌కి  అందించారు. త్వరలోనే చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సురేందర్, ఉపేందర్ రెడ్డిపై మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్