తెలంగాణాలో మరో ఎన్నికలకు డేట్ ఫిక్స్
హైదరాబాద్: తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి.. తమ నిర్ణయాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 […]
హైదరాబాద్: తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి.. తమ నిర్ణయాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలు:
మొదటి దశ పోలింగ్ తేదీ: 06.05.2019
రెండో దశ పోలింగ్ తేదీ: 10.05.2019
మూడో దశపోలింగ్ తేదీ: 14.05.2019