శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేసిన ముస్లిం
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కులాలు, మతాల గోడల్ని చేరిపేస్తూ.. సాటి మనిషికి సాయపడాలనే సారాంశాన్ని ఇచ్చే ఘటనలు కోకొల్లలు. ముస్లింలు హిందువుల ఆలయాలకు… హిందువులు మసీదులకు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా బెంగళూరులో ఓ ముస్లిం వ్యక్తి శ్రీరామనవమి వేడుకల్లో భాగస్వామ్యమయ్యాడు. బెంగళూరు రాజాజీనగర్‌లో నివసించే సద్దాం హుస్సేన్ ఈ నెల 14న శ్రీరామ నవమివేడుకలు ఉండటంతో.. ఆలయాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేశాడు. గత మూడేళ్లగా ప్రతి శ్రీరామనవమికి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాడట. […]
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కులాలు, మతాల గోడల్ని చేరిపేస్తూ.. సాటి మనిషికి సాయపడాలనే సారాంశాన్ని ఇచ్చే ఘటనలు కోకొల్లలు. ముస్లింలు హిందువుల ఆలయాలకు… హిందువులు మసీదులకు వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా బెంగళూరులో ఓ ముస్లిం వ్యక్తి శ్రీరామనవమి వేడుకల్లో భాగస్వామ్యమయ్యాడు.
బెంగళూరు రాజాజీనగర్‌లో నివసించే సద్దాం హుస్సేన్ ఈ నెల 14న శ్రీరామ నవమివేడుకలు ఉండటంతో.. ఆలయాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేశాడు. గత మూడేళ్లగా ప్రతి శ్రీరామనవమికి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాడట. రామాలయాన్ని పరిశుభ్రం చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. ప్రతి ఒక్కరూ తనను అభినందిస్తుంటే… ఆ సంతృప్తి చాలన్నారు.