AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి పోటెత్తిన జనం.. టైమింగ్స్‌ ఇవే!

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారి అరే దీని దృష్టిలో ఉంచుకొని ఈ సారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ లక్ష చేపలను సిద్ధంగా ఉంచింది.

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి పోటెత్తిన జనం.. టైమింగ్స్‌ ఇవే!
Fish Prasadam Distribution At Nampally Exhibition Grounds
Srilakshmi C
|

Updated on: Jun 08, 2025 | 6:36 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 8: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ఏటా ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లను శనివారమే (జూన్ 7) నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. అయితే టోకెన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా మొదలవడంతో క్యూలైన్లో వేచిఉన్న వేలాది జనం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలైన్లలో పడిగాపులు కాసిన జనం.. టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. వేల మందికి కేవలం 2 కౌంటర్లే ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బంది పడ్డారు.

మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం (జూన్‌ 8) తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా ఆదివారం ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. యేటా మృగశిర కార్తెలో పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో జనం ఇతన రాష్ట్రాల నుంచి వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి చేరుకున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదం కోసం ఈ సారి ఏకంగా 42 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ 140 స్పెషల్​ బస్సులను ప్రభుత్వం కేటాయించింది. 8వ తేదీన 60 , 9వ తేదీన 80 బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. అయితే ప్రయాణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆస్తమా, అబ్బసం ,దగ్గు, దమ్ము లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఈ చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. సుమారు 170 సంవత్సరాలనుంచి చేప ప్రసాదాన్ని ఆస్తమారోగులకు పంపిణీ చేస్తున్నారు. రోగులు వారు సహాయల కోసం భోజనం వసతి ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.