ఓల్డ్ సిటీలో తిరుగులేని లీడర్.. ఎంఐఎంలో నెంబర్ 2 పొజిషన్.. అక్బరుద్దీన్ ఓవైసీ రాజకీయ ప్రస్థానం ఇదే..
Akbaruddin Owaisi Telangana Election 2023: ఓల్డ్ సిటీ లీడర్.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్.. మంచి వక్త.. అలాగే ఎంఐఎం పార్టీలో నెంబర్ 2 పొజిషన్.. ఇప్పటికీ మీకో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు.. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే, అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడైన అక్బరుద్దీన్ ఓవైసీ.

Akbaruddin Owaisi Telangana Election 2023: ఓల్డ్ సిటీలో తిరుగులేని లీడర్.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్.. మంచి వక్త.. అలాగే ఎంఐఎం పార్టీలో నెంబర్ 2 పొజిషన్.. ఇప్పటికీ మీకో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు.. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం వ్యవస్థాపకుడు సుల్తాన్ సాలావుద్దిన్ ఓవైసీ తనయుడు, అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడైన అక్బరుద్దీన్ ఓవైసీ. 1970, జూన్ 14న హైదరాబాద్‌లో జన్మించారు. నగరంలోనే ఆయన తన విద్యాభ్యాసాన్ని చేశారు. సెయింట్ మేరీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన.. మెడిసిన్ చదువుతూ మధ్యలో ఆపేశారు. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వివాదాస్పద ప్రసంగాలతో రాజకీయాన్ని హీట్ ఎక్కించారు. అటు ఓ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లాడిన అక్బరుద్దీన్.. ఆ పెళ్లిని తన తండ్రి వ్యతిరేకించడంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
1999, 2004, 2009, 2014.. ఇలా వరుసగా నాలుగుసార్లు చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ జైత్రయాత్రను 2018 ఎన్నికల్లోనూ కొనసాగించారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయనకు.. జనాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ముక్కుసూటిగా మాట్లాడే అక్బరుద్దీన్ ఓవైసీ.. అప్పుడప్పుడూ అధికార పార్టీపై కూడా విమర్శలు కురిపించారు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు అక్బరుద్దీన్ మాట అంటే వేదవాక్కు.
వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్..
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మతం పేరుతో రాజకీయాలు చేయకూడదని ఒకవైపు చర్చ జరుగుతున్నా.. మరోవైపు అక్బరుద్దీన్ ముస్లింలకు వ్యతిరేకంగా చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు.. ముస్లింలు ఆలోచించాలి.. అంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారాన్ని లేపారు. ఈ క్రమంలోనే పలు కేసుల్లో అక్బరుద్దీన్‌ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే సీతాదేవిపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరపున చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు అక్బరుద్దీన్ ఓవైసీ.
కాగా,చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ టఫ్ ఫైట్ చూడనున్నారు. హేమాహేమీలు బరిలో ఉండటంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపు అభ్యర్ధుల మధ్య దోబూచులాట ఆడవచ్చునని సర్వేలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..