AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలమైన దళిత నేత.. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు.. భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానమిదే..

Bhatti Vikramarka Telangana Election 2023: కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది.

బలమైన దళిత నేత.. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు.. భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానమిదే..
Bhatti Vikramarka
Ravi Kiran
|

Updated on: Dec 02, 2023 | 12:51 PM

Share

Bhatti Vikramarka Telangana Election 2023: కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్‌ హయాంలో 2009-11 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్‌ విప్‌‌గా, 2011-14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌ వంటి కీలక పదవులను కూడా చేపట్టారు. వైఎస్సార్‌ని రాజకీయ గురువుగా భావించే భట్టి విక్రమార్క.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం ఇలా..

కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.. 2007-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో చీఫ్ విప్‌గా, 2011 జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై సేవలు అందించారు. ఇక 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా మరోసారి అదే స్థానం నుంచి పోటీ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేతగా కూడా భట్టి విక్రమార్క ఎన్నికైన విషయం తెలిసిందే. ఆప్పటి నుంచి కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న భట్టి విక్రమార్క.. పార్టీలో బలమైన దళిత నేత. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకుల్లో భట్టి విక్రమార్క కూడా ఒకరు.

17 జిల్లాల్లో పాదయాత్ర..

2023 మార్చి 16న ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్​ మార్చ్’ పేరిట​పాదయాత్ర ప్రారంభించి.. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలోమీటర్లు పూర్తి చేశారు మల్లు భట్టి విక్రమార్క. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తన పాదయాత్ర ముగింపులో భాగంగా 2023 జులై 2న రాహుల్‌ గాంధీ ముఖ్య అతిధిగా జన గర్జన సభను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఎగ్జిట్ పోల్స్ అనంతరం కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తమకు వనరులు సమకూర్చిన కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో వేల కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోందని తెలిపారు. దీని కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. అధికారులెవరూ ఇలాంటి వాటికి సహకరించవద్దని సూచించారు. దీనిపై తాము ఈసీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నామని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..