Telangana: మరో 4 రోజులే సమయం.. తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల పర్వం..
తెలంగాణలో నాలుగో రోజు నామినేషన్ల సందడి కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కీలక నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీల్లో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్లలో హైలైట్స్ కోసం వాచ్ దిస్ స్టోరీ.

తెలంగాణలో నాలుగో రోజు నామినేషన్ల సందడి కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కీలక నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీల్లో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్లలో హైలైట్స్ కోసం వాచ్ దిస్ స్టోరీ.
తెలంగాణ శాసనసభ నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇవాళ మంచి రోజు కావడంతో ఎన్నికల బరిలోకి దిగిన పలువురు ముఖ్యమైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికల నామినేషన్ల వేగం పుంజుకుంది. కొడంగల్‌లోరేవంత్ రెడ్డి, కరీంనగర్‌లో బండిసంజయ్, మంత్రులు ఎర్రబెల్లి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి, బిఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు నామినేషన్ ను దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి రిటర్నింగ్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు తొలి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు ఇంటి ఇలవేల్పు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొండగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు కార్యకర్తలు. కార్యకర్తలనుద్దేశించి రేవంత్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు రేవంత్. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తా నుండి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న బండి సంజయ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇక బాల్కొండ నియోజకవర్గం నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పాయల్ శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. నిర్మల్ జిల్లాలో నామినేషన్లు కొనసాగుతున్నాయి. ముధోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తానికి పండితులను, జ్యోతిష్యులను సంప్రదించి.. జాతకాలు, శుభ ఘడియలు, నక్షత్రాలు, తిథులు చూసుకొని పలు పార్టీల అభ్యర్ధులు, ఇండిపెండెంట్స్ నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..