హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. యూనిగ్యాస్ బంక్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు!
హైదరాబాద్ నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న చార్మినార్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడలోని సమృద్ధి ఎస్సార్ యూనిగ్యాస్ బంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడగా.. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఇటీవలే చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాళ్లోకి వెళితే హైదర్‌గూడలోని సమృద్ధి ఎస్సార్ యూనిగ్యాస్ బంక్‌లో ఎయిర్ పైపు లీకవడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పైపుకు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బంక్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ఈ ప్రమాదంలో మాధవ్ , గోపి అనే ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనిచింన సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరిక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే చికిత్సను ప్రారంభించారు. ప్రస్తుతం వారి ఇద్దరి హాస్పిటల్‌లో చికిత్ప పొందుతున్నారు. ఇక ఈ ప్రమాద ఘటనపై హైదర్‌గూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని.. మరీ ముఖ్యంగా ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉండే పెట్రోల్ బంక్‌లు లాంటి ప్రదేశాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ బంక్‌లలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ముందస్తు నియంత్రణ చర్యలను ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. పెట్రోల్ బంకులు ఇంధనం బాగా మండే స్వభావం కలిగి ఉండటం వల్ల, మంటలను నివారించడానికి, నియంత్రించడానికి పటిష్టమైన భద్రతా చర్యలు అవసరమని గుర్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..