Hyderabad: ఓఆర్‌ఆర్‌పై నుంచి గుడిసెలపై పడిన లారీ.. ముగ్గురు దుర్మరణం.. పాపం నిద్రలోనే..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది.

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై నుంచి గుడిసెలపై పడిన లారీ.. ముగ్గురు దుర్మరణం.. పాపం నిద్రలోనే..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 02, 2023 | 8:41 AM

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ పరిధిలో పటాన్ చెర్వు వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. పటాన్‌చెరు నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తున్న లారీ.. సంగారెడ్డి జిల్లా కొల్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అదుపుతప్పింది. లారీ ఓఆర్‌ఆర్‌పై నుంచి కింద ఉన్న గుడిసెలపై పడింది. దీంతో గుడెసెల్లో నివసిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఔటర్‌ రింగురోడ్డు ఎగ్జిట్‌ పాయింట్‌ -2 దగ్గర గురువారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనతో నిరుపేదలు నివసించే ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న వారు.. నిద్రలోనే మృత్యువాత పడడంతో బాధితులు బోరుమంటున్నారు. సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

రామచంద్రపురం ఔటర్ రింగ్ కొల్లూరు వద్ద రింగ్ రోడ్డు పైనుండి అదుపుతప్పి లారీ కింద పడ్డ ఘటనలో కర్ణాటకకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన బాబు రాథోడ్ (48), కమలి బాయ్ (43) , బస్సప్ప రాథోడ్ (23) గా గుర్తించినట్లు తెలిపారు. వీరంతా రింగ్ రోడ్ పక్కన ఉన్న చెట్లకు నీరు పోసే వలస కూలీలని మియాపూర్ ఏసీపీ నర్సింహ రావు వెల్లడించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..