Sankranti Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు

Sankranti Special Trains: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Sankranti Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు
Sankranti Special Trains
Follow us

|

Updated on: Dec 31, 2021 | 4:41 PM

Special Trains: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య 14 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైలు (నెం.07275) జనవరి 03, 05, 07 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.15 గం.లకు లింగంపల్లికి చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07276) జనవరి 04, 06,08 తేదీల్లో సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.10 గం.లకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.

అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.07491) జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 08.10 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు లింగంపల్లికి చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07492) ఈ నెల 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.50 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (82714 సువిధ) జనవరి 11న సాయంత్రం 06.40 గం.లకు లింగంపల్లి నుంచి బయలేదేరి మరుసటి రోజు ఉదయం 06.50 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు (నెం.07275/నెం.07276) సామర్లకోట, రాజమండ్రి, నిడుదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్లు (నెం.07491/నెం.07492) సామర్లకోట, రాజమండ్రి, నిడుదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. మరో ప్రత్యేక రైలు (నెం.82714 సువిధ) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో 1 ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఉండనున్నాయి. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.  ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు మొదలయ్యాయి. నేరుగా రైల్వే టికెట్ కౌంటర్లు లేదా IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.

Also Read..

Good news: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా బ్రాండ్ల మద్యం..

Astro Tips ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి