డైమండ్ రింగ్.. గోల్డ్ చైన్ పేరుతో ఆఫర్! కట్ చేస్తే.. 2.8 లక్షలు మాయం
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి రూ. 2.4 లక్షలు సైబర్ నేరస్థుల బారిన పడింది. పార్సిల్ మోసం ద్వారా ఆమెను మోసం చేశారు. కస్టమ్స్ డ్యూటీ పేరుతో డబ్బులు వసూలు చేశారు. సైబర్ నేరాల నుండి రక్షించుకోవడానికి అవగాహన అవసరం.

సైబర్ నేరగాళ్లుపై దేశవ్యాప్తంగా ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు కల్పించిన కొందరు అమాయకులు మాత్రం సైబర్ నేరస్థుల ట్రాప్‌లో పడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కి చెందిన 27 ఏళ్ల యువతి సైబర్ నేరస్తుల ట్రాప్‌కు గురై రూ.2.4 లక్షలు పోగొట్టుకుంది. యువతి వాట్సాప్ నెంబర్ కు అమన్ ప్రీత్ అనే వ్యక్తి తను ఒక పార్సిల్ ను పంపిస్తున్నానని యువతిని నమ్మించాదు. ఈ పార్సిల్ లో డైమండ్ రింగ్ లు, గోల్డ్ చైన్, ఖరీదైన దుస్తులు, షూ జత లు ఉన్నాయని యువతికి ఫోన్ చేసి నమ్మించి ట్రాప్ చేశారు.
తీరా ఆ పార్సెల్ వచ్చే సమయానికి కస్టమ్ అధికారులు వాటిని ఆపారని, వాటి కోసం మొదట రూ.16 వేల చెల్లించాలని యువతనీ మభ్యపెట్టారు. అలా పలు రకాల కారణాలు చెప్పి రూ.2.4 లక్షల వసూలు చేశారు. తిరిగి వారికి కాల్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీస్ లని పోలీసులను ఆశ్రయించింది. ఏదైనా అనుకోని విధంగా సైబర్ నేరస్థులు మీ డబ్బును కాజేస్తే వెంటనే 1930 కు ఫోన్ చేస్తే మీ డబ్బు సైబర్ నేరస్తుల చేతికి చేరకుండా పోలీసులు వాటిని ఫ్రీజ్ చేసి మీ డబ్బు ను మీకు తిరిగి ఇచ్చేలా చేస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి