Hyderabad: రూ. 7 కోట్ల బంగారాన్నీ ఈజీగా కొట్టేశాడు.. కానీ, ఆ చిన్న మిస్టేక్ అతన్ని పట్టించేసింది..
హైదరాబాద్‌లో సంచలనం రేపిన రూ. 7 కోట్ల బంగారం కేసులో ఫురోగతి సాధించారు పోలీసులు. గోల్డ్ చోరీ చేసిన డ్రైవర్ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాలోని ఏపీ సరిహద్దు దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో సంచలనం రేపిన రూ. 7 కోట్ల బంగారం కేసులో ఫురోగతి సాధించారు పోలీసులు. గోల్డ్ చోరీ చేసిన డ్రైవర్ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లాలోని ఏపీ సరిహద్దు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు ఎస్సార్‌నగర్ పోలీసులు. డ్రైవర్ శ్రీనివాస్ గోల్డ్ దొంగతనానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అయితే డ్రైవర్ ఒక్కరే ఈ కేసులో ఉన్నారా.. లేక మరేవరైనా డ్రైవర్ శ్రీనివాస్ కి సహకరించారా అనే కోణంతో రివ్యూ చేస్తున్నారు పోలీసులు.
ఈనెల 17న రూ. 7కోట్ల విలువ చేసే బంగారంతో పరారయ్యాడు నిందితుడు శ్రీనివాస్. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నాలుగు రోజుల్లో ఎట్టకేలకు రాష్ట్రం దాటి పోకుండానే పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోల్డ్ షాపులతో ఒప్పందం కుదుర్చుకుని బంగారం, వజ్రాభరణాలను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తారు మాదాపూర్ చెందిన రాధిక. కస్టమర్లకు నచ్చితే నేరుగా వారి ఇంటి దగ్గరకే డెలివరీ చేస్తారు. అయితే అనూష అనే మహిళ.. రాధిక దగ్గర రూ. 50లక్షలు విలువ చేసే వజ్రాభరణాలకు ఆర్డర్ ఇచ్చింది.
దీంతో అనూషకు డెలివరీ చేయాల్సిన జువెల్లరీతో పాటు మరో రూ. 7 కోట్ల విలువైన ఇతర నగలను కూడా బంజారాహిల్స్‌లో ఉండే ఒక జువెల్లర్స్ షాపు నుంచి తీసుకురమ్మని తన దగ్గర పనిచేసే డ్రైవర్శ్రీనివాస్కు చెప్పింది రాధిక. అనూష ఆర్డర్ చేసిన నగలు ఇచ్చేందుకు సేల్స్ మెన్ కారులోని నుంచి దిగి లోపలికి వెళ్లగానే డ్రైవర్ పక్కా ప్లాన్ ప్రకారం మిగతా గోల్డ్ ను తీసుకొని కారుతో పాటు పరారయ్యాడు. దీంతో సేల్స్‌మెన్, రాధిక ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, కారుతో పరారైన శ్రీనివాస్.. ఆ కారును కూకట్‌పల్లి సమీపంలో వదిలేసి, నర్సంపేట ప్రాంతంలో ఉండే తన బంధువు ఇంటికెళ్లాడు. తన వెంట ఫోన్ ఉంటే దొరికిపోతానని భావించిన శ్రీనివాస్.. పెట్రోలు ఖర్చుల నిమిత్తం యజమాని రాధిక ఇచ్చిన డెబిట్‌కార్డుతో సెల్‌ఫోన్ కొన్నాడు. అలా కొనుగోలు చేసిన ఫోన్‌ని తన బంధువుకిచ్చి.. అతని ఫోన్‌ను శ్రీనివాస్ తీసుకున్నాడు. అయితే, డెబిట్‌కార్డుతో ఫోన్ కొనుగోలు చేయగా.. ట్రాన్సాక్షన్ మెసేజ్ రాధిక మొబైల్‌కి వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఎంక్వైరీ చేశారు. శ్రీనివాస్ కొనుగోలు చేసిన ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా పోలీసులు శ్రీనివాస్ బంధువును పట్టుకున్నారు. అయితే, అప్పటికే అతడు బస్సులో తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కొవ్వూరుకు వెళ్లినట్లు గుర్తించారు. స్వగ్రామానికి వెళ్లిన శ్రీనివాస్ తన నగలను గొయ్యి తీసి దాచిపెట్టాడు. అతన్ని పట్టుకుని విచారించగా.. దాచిన నగలను అప్పగించాడు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గోల్డ్ చోరీపై అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..