Hyderabad Security: నిఘా నేత్రాలే ప్రధాన ఆయుధం.. అవే లేకపోతే అంతే సంగతి..!
నిఘా నేత్రాలను మరోసారి తెలంగాణ పోలీసులు నిద్ర లేపుతున్నారు. మసకబారి మొద్దు నిద్ర పోతున్న వాటికి పని కల్పించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం వాటి పనితీరుపై ఆరా తీస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. మలక్ పేటలో జరిగిన దోపిడీ ఘటనతో ఒక్కసారిగా తేరుకున్న పోలీసులు నిఘా నేత్రాల దిశగా అడుగులు వేస్తున్నారు. నేరస్తులకు క్షణాల్లో చెక్ పెట్టాలంటే వాటితోనే సాధ్యమని భావిస్తున్నారు. ఇందుకు కాలనీలు, ఇల్లు ఇల్లు తిరిగి మరోసారి అవగాహన కల్పించాలని సంకల్పించారు. హైదరాబాద్ మహా నగరంలో […]

నిఘా నేత్రాలను మరోసారి తెలంగాణ పోలీసులు నిద్ర లేపుతున్నారు. మసకబారి మొద్దు నిద్ర పోతున్న వాటికి పని కల్పించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం వాటి పనితీరుపై ఆరా తీస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. మలక్ పేటలో జరిగిన దోపిడీ ఘటనతో ఒక్కసారిగా తేరుకున్న పోలీసులు నిఘా నేత్రాల దిశగా అడుగులు వేస్తున్నారు. నేరస్తులకు క్షణాల్లో చెక్ పెట్టాలంటే వాటితోనే సాధ్యమని భావిస్తున్నారు. ఇందుకు కాలనీలు, ఇల్లు ఇల్లు తిరిగి మరోసారి అవగాహన కల్పించాలని సంకల్పించారు.
హైదరాబాద్ మహా నగరంలో మరోసారి పోలీస్ సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. పని చేసే,ః పని చేస్తున్న వాటి వివరాలు జోన్ల వారీగా సేకరిస్తున్నారు. మరమ్మతుకు సిద్ధంగా ఉన్న వాటిని వెంటనే రిపేర్ చేయించాలని పోలీస్ స్టేషన్ ల వారీగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉణ్న లక్షా 32 వేలకు పైగానే పోలీసులకు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ట్రాఫిక్ పోలీసుల పరిధిలోకి వస్తాయి. వీటి వాడకం కన్నా రిపేర్ కే ఉన్నవే ఎక్కువ.
ఇక… కమ్యూనిటీ సీసీ కెమెరాలు అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను సైతం అని మొదలు పెట్టిన ఇంటింటికి కెమెరాలు కలిపి మరో లక్షకు పైగానే సీసీ కెమెరాలు ఉంటాయి. హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో అన్ని కలిపి మరో నాలుగు లక్షల కెమెరాలు ఉంటాయని అంచనా. అయితే, షాపులు, కాలనీలలో వుండే కెమెరాలు అన్నీ స్థానిక పోలీస్ స్టేషన్ కి లింక్ ఐ ఉంటాయి. గతంలో వీటి వాడకంపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి నిర్లక్ష్యం చేసిన వ్యాపారులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇక రాను రాను వీటిని అడిగేవారు లేకుండా పోయారు.
తాజాగా మరోసారి మూడు కమిషనరేట్ల పోలీసులు దీనిపై మరోసారి దృష్టి పెట్టారు. మలక్ పేటలో కిస్వా నగల షాప్ లో జరిగిన దోపిడీలో నిందితులకు వెంటనే చెక్ పెట్టేలా చేసినవి సీసీ కెమెరాలు. అయితే సిసి కెమెరాల్లో రికార్డ్ అయిన వారి వేషధారణ మాట పసిగట్టిన పోలీసులు నిందితులకు 24గంటల్లో చెక్ పెట్టేలా చేశారు. దీంతో మరోసారి సీసీ కెమెరాల పనితీరు అర్ధం అయ్యింది. మరోసారి వీటి వాడకంపై ప్రజల్లో అవగాణ కల్పించి వీటిని పెంచేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
