NTR Coin: సరికొత్త రికార్డ్ సాధించిన ఎన్టీఆర్ స్మారక నాణేం.. ఏ స్థానంలో నిలిచిందో తెలుసా..?
ఈమధ్య కాలంలో నాణేలపై ప్రముఖుల బొమ్మను ముద్రించడం తెగ ట్రెండింగ్ గా మారింది. దీనికి కారణం వారిపై ఉన్న ప్రజాధారణను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది. గతంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీటిని ముద్రించేవారు. వాటిని కూడా గొప్ప వాళ్లకు బహుమతిగానో లేక విక్రయానికి తమ అధికార సైట్లో ఉంచేవారు.
ఈమధ్య కాలంలో నాణేలపై ప్రముఖుల బొమ్మను ముద్రించడం తెగ ట్రెండింగ్ గా మారింది. దీనికి కారణం వారిపై ఉన్న ప్రజాధారణను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది. గతంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీటిని ముద్రించేవారు. వాటిని కూడా గొప్ప వాళ్లకు బహుమతిగానో లేక విక్రయానికి తమ అధికార సైట్లో ఉంచేవారు. అయితే ఇప్పటి వరకూ ముద్రించిన నాణేల్లోకెల్లా ఎన్టీఆర్ నాణేనికే ఎక్కువ ఆదరణ లభించినట్లు హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు పేర్కొన్నారు. గతంలో ముద్రించిన నాణేల్లో అత్యధికంగా విక్రయించింది 12వేలు మాత్రమే అని.. ఆ రికార్డును ఎన్టీఆర్ నాణెం చెరిపేసిందని తెలిపారు. ముద్రించిన రెండు నెలల్లో దాదాపు 25వేల నాణేలు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు. ఇది దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా తెలిపారు.
హైదరాబాద్ మింట్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారవడం చాలా గొప్ప విషయమన్నారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ. జనార్ధన్. ఇప్పటి వరకూ దేశంలో 200 మంది ప్రముఖులకు సంబంధించిన స్మారక నాణేలను విడుదల చేయగా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగిన ఘనత ఎన్టీఆర్ స్మారక నాణేనికే చెందుతుందన్నారు. ప్రస్తుతం ఇది మొదటి స్థానంలో కొనసాగుతోందని తెలిపారు. ఇందులో వెండి, ఇత్తడి, బంగారం కలిపి రూపొందించనున్నట్లు వివరించారు. మూడు రకాల ప్యాకింగ్ లో అందుబాటులో ఉన్నాయన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..