Independent candidate: స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య.. వారి వేధింపులే కారణమన్న కుటుంబ సభ్యుల ఆరోపణ
తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. చాలా మంది నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు. ఈక్రమంలోనే రాజకీయ నాయకులతో పాటూ పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గత 10 రోజుల క్రితమే నామినేషన్ ప్రక్రియ పూర్తైన విషయం మనకు తెలిసిందే. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగేందుకు, తమ నియోజకవర్గంలో నాయకుడికి గట్టపోటీ ఇచ్చేందుకు ఇండిపెండెంట్ గా కొందరు
తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. చాలా మంది నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు. ఈక్రమంలోనే రాజకీయ నాయకులతో పాటూ పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గత 10 రోజుల క్రితమే నామినేషన్ ప్రక్రియ పూర్తైన విషయం మనకు తెలిసిందే. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగేందుకు, తమ నియోజకవర్గంలో నాయకుడికి గట్టపోటీ ఇచ్చేందుకు ఇండిపెండెంట్ గా కొందరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇలా నామినేషన్ వేసిన వారి సంఖ్య వేలల్లోనే ఉందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. అయితే స్వతంత్ర అభ్యర్థి విషయంలో తీవ్ర విషాదం నెలకొంది.
నిజామాబాద్ అర్బన్ లో స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్ ఆత్మ హత్యకు పాల్పడ్డారు. అలియాన్స్ అఫ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఇతను నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరౌతోంది. నాయకుడు అవుతాడని భావించిన వ్యక్తి కానరాని లోకాలకు వెళ్తాడనుకోలేదు అని కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. కన్నయ్య మరణానికి కారణం లోన్ యాప్ వేధింపులే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థిగా నిలబడిన కన్నయ్య ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..