Kerala: కేరళ నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష.! చివరి ప్రయత్నాలు చేస్తున్న ఆమె తల్లి.

ఉపాధి కోసం యెమెన్ వెళ్లి అక్కడ ఓ హత్య కేసులో నిందితురాలిగా తేలడంతో కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష దాదాపు ఖరారయ్యింది. నిమిష ప్రియ తన కుటుంబంతో కలిసి యెమెన్ దేశం వెళ్లి అక్కడ నర్సుగా స్థిరపడింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్ కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం యెమెన్ లోనే ఉండిపోయింది. 2015లో ఆమె యెమెన్ లోనే సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. ఆమెకు స్థానికుడైన తలాల్ అబ్డో మహ్దీ సాయపడ్డాడు.

Kerala: కేరళ నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష.! చివరి ప్రయత్నాలు చేస్తున్న ఆమె తల్లి.

|

Updated on: Nov 18, 2023 | 6:06 PM

ఉపాధి కోసం యెమెన్ వెళ్లి అక్కడ ఓ హత్య కేసులో నిందితురాలిగా తేలడంతో కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష దాదాపు ఖరారయ్యింది. నిమిష ప్రియ తన కుటుంబంతో కలిసి యెమెన్ దేశం వెళ్లి అక్కడ నర్సుగా స్థిరపడింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్ కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం యెమెన్ లోనే ఉండిపోయింది. 2015లో ఆమె యెమెన్ లోనే సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. ఆమెకు స్థానికుడైన తలాల్ అబ్డో మహ్దీ సాయపడ్డాడు. విదేశీయులు యెమెన్ లో ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలంటే స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి. అయితే, కొంతకాలానికి నిమిష ప్రియ, మహ్దీ మధ్య గొడవలు మొదలయ్యాయి. యెమెన్ జాతీయుడైన మహ్దీ… నిమిష ప్రియను చిత్రహింసలు పెట్టేవాడు. ఆమె పాస్ పోర్టును లాగేసుకున్నాడు. అతడి నుంచి శారీరక, మానసిక వేధింపులు తీవ్రం కావడంతో అతడి నుంచి తన పాస్ పోర్టును వెనక్కి తీసుకునేందుకు నిమిష ప్రియ ప్రయత్నించింది. మహ్దీకి మత్తు మందును ఇంజెక్షన్ రూపంలో ఇచ్చింది. ఆ మందు మోతాదు మించడంతో మహ్దీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో 2017 నుంచి ఆ దేశం జైలు శిక్ష అనుభవిస్తున్న నిమిషా ప్రియా మరణశిక్ష అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ప్రియా.. తలాల్ అబ్దో మహదీని తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో అతనికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి చంపినందుకు ఆమెను దోషిగా నిర్ధారించారు. యెమెన్‌ వెళ్లాలని ప్రియా తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్రాన్ని కోరింది. అరబ్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉన్నప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ నర్సు తల్లి ఆమెను విడుదల చేయడానికి “బ్లడ్ మనీ” లేదా మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుతోంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా… యెమెన్ లో నిమిష ప్రియ అప్పీల్ ను అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని కేంద్రం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ తల్లిని యెమెన్ పంపడంలో సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. ఈ అంశాన్ని భారత కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, అవసరమైతే దౌత్య పరమైన సాయం తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!