Telangana Election: గ్రేటర్‌లో గులాబీ పాచిక పారేనా? కీలకంగా మరినా ఆ ఓటర్లు ఎవరి వైపు..?

పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబా‌ద్‌లో తెలంగాణ ప్రాంతేతర ఓటర్లపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. హోరా హోరీగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఓట్లు కీలకంగా మారడంతో, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగట్టేందుకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Telangana Election: గ్రేటర్‌లో గులాబీ పాచిక పారేనా? కీలకంగా మరినా ఆ ఓటర్లు ఎవరి వైపు..?
Kcr On Hyderabad
Follow us
Sridhar Prasad

| Edited By: Balaraju Goud

Updated on: Nov 19, 2023 | 11:10 AM

పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబా‌ద్‌లో తెలంగాణ ప్రాంతేతర ఓటర్లపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. హోరా హోరీగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఓట్లు కీలకంగా మారడంతో, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగట్టేందుకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారి మద్దతు పొందడంలో గులాబీ దళం సక్సెస్ అవుతుందా..? లేదన్న హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్నాయి. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా ఓటర్లను చేరువ అయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పక్కాగా ఓటింగ్ తమ వైపు తిప్పుకునేలా ఫ్లాన్ అమలు చేస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల వారు ఉండడంతో వారి ఓట్లపై బీఆర్ఎస్ పార్టీ నజర్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు గెలవాలంటే వారి ఓట్లు కీలకం. అందుచేత వారి విశ్వాసం పొందే ప్రయత్నంలో గులాబీ పార్టీ ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కువగా ఆంధ్ర , రాయలసీమతో పాటు ఉత్తర భారత దేశానికి చెందిన ఓటర్లు పలు నియోజకవర్గాల్లో భారీగా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో వీరి ఓట్లను రాజకీయ పార్టీలు కీలకంగా భావించాయి. ఇప్పుడు కూడా హోర హోరీగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లు తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది అధికార పార్టీ బీఆర్ఎస్. ఆ ప్రాంతాలకు చెందిన ఓటర్లతో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గులాబీ పార్టీ అభ్యర్ధులు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా సామాజికవర్గ నేతల భేటీలు పూర్తి చేసే పనిలో ఉన్నారట.

ఇక చివరి దశలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒకరిద్దరు నేతలు ఆయా సామాజిక వర్గాలతో భేటీలు నిర్వహించి మద్దతు కొరతరని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా.. 2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై పైచేయి సాధించింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా గ్రేటర్ లో అదే స్థాయిలో సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలలో మునిగి తేలుతోంది గులాబీ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల ఎటువైపు ఉంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎంఐఎం ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానలలో బీఆర్ఎస్ పాగా వేస్తుందా లేదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…