AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ‘తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొంది’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. రెండు రోజుల క్రితం అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. నిన్న ప్రచార కమిటీని కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలన్నారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొందని తెలిపారు.

Revanth Reddy: 'తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొంది'.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Tpcc Chief Revanth Reddy Press Meet On The Occasion Of Telangana Election
Srikar T
|

Updated on: Nov 19, 2023 | 12:15 PM

Share

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. రెండు రోజుల క్రితం అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. నిన్న ప్రచార కమిటీని కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలన్నారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అడ్వకేట్ జనరల్ ను నియమించ లేదన్నారు. ప్రజాస్వామ్యంపై పోరాడుతూ కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందన్నారు. భూమి కోసం తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగియని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, సమన్యాయం లేదంటూ విమర్శించారు. హక్కుల కోసం తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ది ఇచ్చేందుకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాదర్భార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

రేవంత్ రెడ్డి పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..