మామూలు రోజులతో పోలిస్తే చలికాలంలో రోగనిరోధకశక్తి చాలా అవసరం అవుతుంది. ఇందుకోసం చాలా మంది ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు
TV9 Telugu
అయితే ఉసిరి ఈ విషయంలో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో విటమిన్ సితోపాటు ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి
TV9 Telugu
చలికి చర్మం, జుట్టు మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా మారి గరుకు బారుతుంది. దీనికి ఉసిరితో చెక్ పెట్టవచ్చు. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మం, జుట్టు సంరక్షనలో తోల్పడతాయి
TV9 Telugu
ఉసిరి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. అలాగే ఈ కాలంలో వేధించే చుండ్రుని కూడా ఉసిరి తేలిగ్గా నివారిస్తుంది
TV9 Telugu
అయితే ఉసిరిని దాని పుల్లని రుచి కారణంగా నేరుగా తినలేం. దీనిని సలాడ్, జ్యూస్, మురబ్బాల రూపంలో తీసుకోవచ్చు. ఫలితంగా దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను సులువుగా తరిగికొట్టవచ్చు
TV9 Telugu
ఉసిరిలో ఉండే పీచు జీర్ణ సమస్యలను నివరించి పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దాంతో మలబద్ధకం దూరమవుతుంది. జీర్ణవ్యవస్థ నుంచి వ్యర్థాలు తేలిగ్గా దూరమవుతాయి