Viral Video: రీల్స్ కోసం ఎంతకు తెగించర్రా! ప్రాణమంటే లెక్కేలేదా?
సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వెర్రి వేషాలు వేస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి రీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి నుంచి తప్పించుకునే పేరుతో తన చుట్టూ గడ్డిని కట్టుకున్నాడు. అంతేగాక, గడ్డికి నిప్పంటించుకుని బైక్ నడుపుతూ వెళ్లాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వెర్రి వేషాలు వేస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి రీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి నుంచి తప్పించుకునే పేరుతో తన చుట్టూ గడ్డిని కట్టుకున్నాడు. అంతేగాక, గడ్డికి నిప్పంటించుకుని బైక్ నడుపుతూ వెళ్లాడు. ఈ రీల్ చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్ కోసం ప్రాణాలతో చెలగాటం ఎందుకు? అంటూ మండిపడుతున్నారు.
ఆ వీడియోలో వ్యక్తి తన శరీరం మొత్తాన్ని గడ్డితో చుట్టుకుని.. బైంక్ హ్యాండిల్ బార్లకు రెండు కుండలను కట్టుకున్నట్లు కనిపిస్తోంది. తనతో చుట్టుకున్న గడ్డికి, కుండల్లోని గడ్డికి కూడా నిప్పు పెట్టడంతో అవి మండుతున్నాయి. సీటు వెనుకాల కూడా ఓ కుండను పెట్టి మంట పెట్టాడు. ఇలా గడ్డి అంతా మండుతుండగా అతడు బైక్ నడుపుతూ వెళుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇంత ప్రమాకరమైన స్టంట్లు అవసరమా? అని మండపిడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు.
रील ऐसी बनाओ कि
👇🏻👇🏻😂😂 pic.twitter.com/piG5RxwuwQ
— तैमूर का जीजा 😎 🇮🇳 (@brijeshchaodhry) December 30, 2025
ఈ వీడియోను బ్రిజేష్ చౌదరి అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 13 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. వందలాది మంది కామెంట్లు పెడుతున్నారు. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి ఇలాంటి స్టంట్లు చేయడం అవసరమా? అని మండిపడుతున్నారు. ‘రీల్ కోసం ఇంత రిస్కా? జీవితం చాలా విలువైనది సోదరా!’ అని రాశారు. మరొకరు ఇది దేశీ ఘోస్ట్ రైడర్ అని పేర్కొన్నారు. రీల్ కోసం ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.