ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలియజేయడం జరిగింది.
అదే విధంగా, ఒక వ్యక్తి కొన్ని అలవాట్లను వదిలేయడం ద్వారా, నూతన సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండచ్చునంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
చాణక్య నీతి ప్రకారం ఏ వ్యక్తి అయితే అవకాశానికి విలువ నివ్వకుండా నిరంతరం సోమరిగా ఉంటాడో, ఆ వ్యక్తి జీవితం అంధకారంలో ఉంటుంది. అందుకే సోమరితనం వదిలి వేయాలి.
కొందరు ఆలోచించకుండా మాట్లాడుతూ, మాటలు బాణాల్లా విసిరవేస్తారు, అందుకే ఎప్పుడూ కూడా ఆలోచించకుండా మాట్లాడకూడదు, ఇది అన్నింటికీ ముప్పే.
ఆచార్య చాణక్యుడు, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు అని చెబుతున్నాడు, గుడ్డి నమ్మకం అనేది ద్రోహానికి దారి తీస్తుంది. అందుకే జాగ్రత్త అవసరం.
అలాగే కొంత మంది ఖర్చు ఎక్కువ చేస్తూ పొదుపు చేయడంలో విఫలం అవుతారు. అందుకే ఖర్చు చేయడం తగ్గించుకొని, పొదుపు చేయాలి.
కొందరు ఇతరులతో తమను పోల్చుకుంటూ, నిరాశకు లోను అవుతారు. అందువలన ఇతరులతో పోల్చుకోవడం ఆపెయ్యడం మంచిది.
అదే విధంగా చాణక్యుడి ప్రకారం, తప్పుడు వ్యక్తితో సహవాసం కూడా మంచిది కాదంటున్నాడు చాణక్యుడు. ఇది మీలో ప్రతికూల ఆలోచనలకు కారణం అవుతుందంట.