కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసి రావాలా.. అయితే ఇంటికి ఇవి తెచ్చుకోవాల్సిందే!

Samatha

1 January 2026

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మంది ఈ సంవత్సరం తమకు అదృష్టం కలిసి రావాలి అని గుడికి వెళ్లి పూజలు చేయించుకోవడం చేస్తుంటారు.

కొంత మంది లక్కు కోసం ఇంటికి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. అయితే ఈరోజు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం మంచిదో చూద్దాం.

నూతన సంవత్సరం రోజున మనీ ప్లాంట్ ఇంటికి తెచ్చుకొని నాటడం చాలా మంచిదంట. దీని వలన ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది.

అలాగే, కొత్త సంవత్సరం రోజు తులసి మొక్క నాటడం కూడా చాలా శుభ ప్రదం. దీని వలన ఈ ఏడాది మొత్తం మీ పై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.

అదే విధంగా, తాబేలు ప్రతిమను ఈ రోజు ఇంటికి తెచ్చుకోవడం వలన పనుల్లోని ఆటంకాలు తొలిగిపోయి ఆనందంగా ఉంటారు.

అలాగే దక్షిణా మూర్తి చిత్రపటం కొనుగోలు చేసి, పూజ గదిలో అమర్చడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయంట.

అలాగే కొత్త సంవత్సరం రోజున కుబేర యంత్రం కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకోవడం వలన ధనం, ధాన్యానికి లోటు ఉండదు అని చెబుతున్నారు పండితులు.

ఈరోజు గోమతి చక్రాలు కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకోవడం వలన ఇల్లు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని చెబుతున్నారు పండితులు.