Telangana Rain Alert: మండుటెండల నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం.. రాగల 4 రోజుల పాటు వర్షాలు..
Telangana Rain Alert: మొన్నటి వరకు దంచికొట్టిన ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ వాసులకు ఇటీవల కురుస్తోన్న వర్షాలతో ఉపశమనం లభించింది. అయితే రానున్న 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు...
Telangana Rain Alert: మొన్నటి వరకు దంచికొట్టిన ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ వాసులకు ఇటీవల కురుస్తోన్న వర్షాలతో ఉపశమనం లభించింది. అయితే రానున్న 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ విషయమై హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 23 నుంచి 27 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. అంతేకాకుండా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్ నెల మొదట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఒకానొక సమయంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ఇక హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొట్టాయి. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో నగర జీవులు ఎండల నుంచి ఉపశమనం పొందారు.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: SBI ATM: డెబిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు.. ఎలాగంటే..!