Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasal Spray Covid Vaccine: కోవిడ్ కట్టడికి సరికొత్త వ్యాక్సిన్.. విమ్స్‌లో నాసల్ స్ప్రే ట్రయల్స్ స్టార్ట్..

కరోనా మహమ్మారి ఇప్పటికే మూడు విడతలుగా ప్రపంచ వ్యాప్తంగా వినాశనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ పూర్తి వేగంతో నడుస్తోంది.

Nasal Spray Covid Vaccine: కోవిడ్ కట్టడికి సరికొత్త వ్యాక్సిన్.. విమ్స్‌లో నాసల్ స్ప్రే ట్రయల్స్ స్టార్ట్..
Nasal Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 23, 2022 | 1:23 PM

Nasal Spray Covid Vaccine: కరోనా మహమ్మారి ఇప్పటికే మూడు విడతలుగా ప్రపంచ వ్యాప్తంగా వినాశనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ పూర్తి వేగంతో నడుస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోట్లాది మందికి పైగా వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా అందించింది. స్వదేశీ వ్యాక్సిన్‌లతో పాటు, రష్యాకు చెందిన స్పుత్నిక్ V వ్యాక్సిన్ అందుబాటు ఉన్నాయి. ఇంతలో, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ స్ప్రే కోవిడ్ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది.

కరోనాపై యుద్ధంలో నాసల్ స్ప్రే కోవిడ్ వ్యాక్సిన్ పెద్ద ఆయుధంగా నిరూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ టీకా ఒక మోతాదు మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. ప్రస్తుతం యుకే, యూఎస్, ఇండియా, చైనా వంటి దేశాల్లో నాసల్ స్ప్రే క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ నాసల్ డ్రాప్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. ముక్కు ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యులు ప్రారంభించారు. ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని, తాజాగా థర్డ్ పేస్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు విమ్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నట్లు రాంబాబు తెలిపారు. గతంలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని వారిపై ప్రయోగాలు చేస్తున్నామన్నారు. ఏపీలో విమ్స్‌లో మాత్రమే నాసల్ డ్రాప్స్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు డ్రాప్స్ వేశాక.. మళ్లీ 28వరోజు రెండో డోస్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మామూలు వ్యాక్సిన్ల కంటే, నాసల్ ట్రయల్స్‌కు ఆరు నెలల సమయం పడుతుందన్నారు. ఇంజక్షన్ వ్యాక్సినేషన్ కంటే నాసల్ వ్యాక్సినేషన్ మరింత మెరుగైన ఫలితాల్లందిస్తుందని ఆశిస్తున్నామని విమ్స్ డైరెక్టర్ రాంబాబు పేర్కొన్నా

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముక్కు ద్వారా ఇవ్వబడిన నాసల్ స్ప్రే కోవిడ్ వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కరోనాపై పోరాటంలో గేమ్ ఛేంజర్ అని నిరూపితమైందని నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను వాడితే ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తగ్గుతుంది. పైగా నాసికా వ్యాక్సిన్‌ను పిల్లలకు కూడా ప్రయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక డోస్ మాత్రమే సరిపోతుంది. అయితే ఇప్పుడు రెండు డోసులు ఇస్తున్నారు. ఇది ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది. స్టోరేజీ సమస్య తగ్గుతుంది. శ్వాసకోశ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also…. Viral Photo: ఇదేం మాస్ మావ.. టీ తాగడానికి ఏకంగా ట్రైన్ ఆపాడు.. రాఖీ బాయ్ ఫాలోవర్ అనుకుంట!