Telangana: గవర్నర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. ఆ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళసై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య, విద్య కళాశాలలో పీజీ సీట్లల్లో దందాపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రైవేటు వైద్య కళాశాలలు...
తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళసై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య, విద్య కళాశాలలో పీజీ సీట్లల్లో దందాపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రైవేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ దందాలో మంత్రులు.. మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మె్ల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఈ దందాలో భాగస్వామ్యం అయ్యారని పేర్కొ్న్నారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగులను ఆసరా చేసుకుని ఏటా రూ.వంద కోట్లు విలువైన సీట్లను బ్లాక్ చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో సీట్ల కోసం ధరఖాస్తు చేయించడం, సీట్ల కేటాయింపు, కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇతరులకు రెండు నుంచి రెండున్నర కోట్లకు అమ్ముకుంటున్నారని లేఖలో ఆరోపించారు. కన్వీనర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మధ్య తరగతి విద్యార్ధులకు రావల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సీట్ల దందాపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ ను రేవంత్ రెడ్డి కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 58 మంది విద్యార్ధులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు పొందినా చేరలేదు. ఇదే జాబితాలో 12 మంది సీటు బ్లాకర్స్ ఉన్నట్లు లోకల్ స్టూడెంట్స్ ఓ జాబితా విడుదల చేశారు. దీనిపై ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ర్టాల్లో మంచి ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్దుల పేరిట అన్ని విడతల్లో దరఖాస్తు చేయిస్తున్నారు. ముందుగానే ఆయా అభ్యర్ధులతో ఒప్పందం కుదుర్చుకుంటూ కాలేజీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా తమ దందా కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read