Exams: తరుముకొస్తున్న పరీక్షల తరుణం.. ప్రణాళికతో సాగితేనే విజయం
తెలంగాణలో(Telangana) నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇదే సమయంలో పది, ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతిక్షణం విలువైనదే. టైం ను వేస్ట్ చేసుకోకుండా ....
తెలంగాణలో(Telangana) నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇదే సమయంలో పది, ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతిక్షణం విలువైనదే. టైం ను వేస్ట్ చేసుకోకుండా ప్లాన్ ప్రకారం చదువుకుంటే సులభంగా లక్ష్యం చేరుకోవచ్చు. క్షణం.. నిమిషం.. గంట.. రోజు.. ఇలా ఒక్క దాన్నీ.. ఆపడం సాధ్యం కాదు. నడుస్తున్న కాలాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడమే జీవితం. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా చివరి రోజుల్లో జ్ఞానోదయం పొంది.. అరే.. అలా చేస్తే బాగుండేది.. ఇలా చేయాల్సింది.. ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్లం.. అని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి సందర్భం చాలా మందికి ఎదురవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు(Exams) సమీపిస్తున్నాయి. యువతకు ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే ఒక్క నిమిషమైనా వృథా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అందరికీ విద్యార్థి(Students) దశ అత్యంత ముఖ్యమైనది. చదువు, ఆహార అలవాట్లు పక్కా ప్రణాళికగా ఉంటే విజయ తీరాలకు చేరవచ్చు. మే నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు అధిక సమయం చదువుకోవడానికి కేటాయించాలి.
లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏకాగ్రత అవసరం. చదువుకునేటప్పుడు సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అడ్డంకులుగా మారతాయి. యువత పగలు, రాత్రి అనే తేడా లేకుండా సెల్ ఫోన్ ను ఉపయోగించడం నేడు సర్వసాధారణమైంది. మరి కొందరు టీవీ చూస్తే గడిపేస్తున్నారు. వీటని కొన్నాళ్లు పక్కన పెట్టి, అభ్యాసంపై దృష్టి సారించడం మంచిది. కబుర్లతో కాలక్షేపం చేయకుండా ముందుకు వెళితే పరీక్షల్లో విజయం సాధించడం ఏమంత కష్టమైన పని కాదు.
Also Read
World Book Day: నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం.. ఒక పుస్తకం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?