PK Meet KCR: కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్‌లు కలిసి పనిచేస్తాయా?
తెలంగాణ పాలిటిక్స్ పీకే చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ శనివారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.
PK Meet CM KCR: తెలంగాణ(Telangana) పాలిటిక్స్ పీకే చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ శనివారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో నేషనల్ పాలిటిక్స్‌పై పీకే కీలక చర్చలు జరిపినట్టు వార్తలొస్తున్నాయి. టీఆర్‌ఎస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. తగిన వ్యూహాలు రచిస్తున్నారు. కొంతకాలంగా సీఎం కేసీఆర్‌తో విస్తృత చర్చలు జరుపుతున్నారు పీకే. నేడోరేపో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో కేసీఆర్‌తో సమావేశం కావడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ గట్టిగానే గొంతెత్తుతోంది. ఏకకాలంలో అటు కాంగ్రెస్.. ఇటు టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇవాళ కూడా మరోసారి సీఎం కేసీఆర్‌తో రాజకీయ చర్చలు జరపనున్నారు పీకే. సాయంత్రం లేదా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో పీకే హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారిద్దరి మధ్య చర్చలు పొద్దుపోయే వరకు జరిగాయి. ఇందుకోసం పీకే శనివారం రాత్రి ప్రగతిభవన్‌లోనే బస చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఇప్పటికే టీఆర్ఎస్‌తో ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి రాజకీయ, పాలన పరిస్థితులపై సర్వే నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. పీకే ఆ నివేదికను కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తాను టీఆర్ఎస్‌తో పనిచేస్తానని పీకే తేల్చి చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం కూడా చర్చలు కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రధానంగా ఈ నెల 27న తెలంగాణ రాష్టర సమితి 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ప్లీనరీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పీకే తాజా సర్వే, టీఆర్ఎస్ బలోపేతం వంటి అంశాలపైనా చర్చించనున్నట్లు సమాచారం.
Read Also…. Tirumala: మండుతున్న ఎండలు.. తిరుమల గిరులపై భక్తులు తీవ్ర ఇక్కట్లు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం