Tirumala: మండుతున్న ఎండలు.. తిరుమల గిరులపై భక్తులు తీవ్ర ఇక్కట్లు..
Tirumala: ఓ వైపు తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. మరోవైపు వేసవి ఎండల(Summer) ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రకృతి రమణీయంగా పచ్చదనంతో కళకళలాడే..

Tirumala: ఓ వైపు తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. మరోవైపు వేసవి ఎండల(Summer) ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రకృతి రమణీయంగా పచ్చదనంతో కళకళలాడే తిరుమల కొండపై భానుడి ప్రతాపం చూపుతుండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో (Mada Veedhulu) పాదరక్షకాలు నిషేధం ఉండటంతో భక్తులు ఎండ వేడిమి తాళలేక పరుగులు తీస్తున్నారు.
వాయిస్ : భానుడి భగభగలతో తిరుమల కొండపై కూడా ఉక్కుపోత మొదలైంది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో భక్తులు గదుల్లోనే పాద రక్షాలు వదిలేసి తిరుగుతూఉంటారు. అలాంటివారంతా కాలుతున్న నేలపై నడవలేక పరుగులు తీస్తున్నారు. ఉదయం నుండే ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి నుంచి ఉపశమనం కల్గించేందుకు టీటీడీ నిత్యం టాంకర్లతో మాఢవీధులను కాసేపటికి ఆవిరవుతున్నాయి. టీటీడీ వేయించిన కూలింగ్ పెయింట్, ఎర్రతివాచీలపై భక్తులు త్వరత్వరగా నడుస్తూ షెడ్లకిందకు చేరుకుంటున్నారు. కొందరు భక్తులు పగలంతా గదులకే పరిమితమవుతున్నారు.
Also Read: Pawan: నన్ను దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదు.. వైసీపీ పై నిప్పులు కురిపించిన పవన్
TTD News: టీటీడీ స్క్రీన్లపై సినిమా పాటలు.. అలా చేయడంతోనే ఇలా అయిందన్న అదనపు ఈవో




