Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: టీటీడీ స్క్రీన్లపై సినిమా పాటలు.. అలా చేయడంతోనే ఇలా అయిందన్న అదనపు ఈవో

టీటీడీ డిజిటల్ స్క్రీన్లలో సినిమా పాటలు ప్రసారమవడంపై అడిషనల్ ఈఓ(TTD Additional EO) స్పందించారు. బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది తప్పిదంతో ఈ ఘటన జరిగిందన్నారు. బ్రాడ్ కాస్టింగ్ ఉద్యోగి తన మిత్రుడిని క్యాబిన్ లో పెట్టి బయటకు వెళ్లడంతో, అతడి మిత్రుడు...

TTD News: టీటీడీ స్క్రీన్లపై సినిమా పాటలు.. అలా చేయడంతోనే ఇలా అయిందన్న అదనపు ఈవో
Ttd
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 23, 2022 | 3:48 PM

టీటీడీ డిజిటల్ స్క్రీన్లలో సినిమా పాటలు ప్రసారమవడంపై అడిషనల్ ఈఓ(TTD Additional EO) స్పందించారు. బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది తప్పిదంతో ఈ ఘటన జరిగిందన్నారు. బ్రాడ్ కాస్టింగ్ ఉద్యోగి తన మిత్రుడిని క్యాబిన్ లో పెట్టి బయటకు వెళ్లడంతో, అతడి మిత్రుడు ఛానల్ మార్చారన్నారు. ఇలా చేయడంతోనే స్క్రీన్లపై సినిమా పాటలు వచ్చాయని వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల(Tirumala) శ్రీవారి సన్నిధిలో నిన్న అపచారం జరిగింది. డిజిటల్ స్క్రీన్‌పై ఆడియోలో భక్తి పాటలు వస్తే, వీడియోలో మాత్రం సినిమా పాటలు రావడం విస్మయం కలిగించింది. ఈ వేరియేషన్ చూసిన భక్తులు షాక్ అయ్యారు. డిజిటల్ స్క్రీన్లపై దాదాపు అరంగపాటు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. వీటిని గమనించిన భక్తులు.. వీడియోలను తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొందరు విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రసారాలను నిలిపివేశారు.

తిరుమలలో టీటీడీకి ప్రత్యేకంగా బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగం ఉంది. ఆ విభాగానికి టీటీడీ ఎలక్ట్రికల్‌ అధికారి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. అక్కడి ఉద్యోగులపై సరైన పర్యవేక్షణ లేకనే సినిమా పాటలు ప్రసారమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇదే అధికారి విధుల్లో ఉన్న సమయంలో ఓ ప్రైవేటు ఛానల్‌ దృశ్యాలు ప్రసారమయ్యాయి. అయితే, ఈ ఉదంతంపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ.. సెట్‌టాప్‌ బాక్స్‌లో సాంకేతిక లోపం వల్లనే సినిమా పాటలు ప్రసారమయ్యాయని, సిబ్బంది వెంటనే స్పందించి సరిచేశారని వివరణ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Bottle Gourd: సమ్మర్‌లో సొరకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్..

Hyderabad: గుడిలో మర్డర్.. అయ్యగారు.. ఆశీర్వదిస్తాడనుకుంటే.. అంతం చేశాడు..