AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కుటుంబానికి అండగా ఉంటాం.. ఆ పిల్లల భాద్యత పార్టీదే.. పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏలూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా చింతలపూడి(Chintalapudi) నియోజవర్గం మట్టంగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు కాకొల్లు బాబురావు...

ఆ కుటుంబానికి అండగా ఉంటాం.. ఆ పిల్లల భాద్యత పార్టీదే.. పవన్ కల్యాణ్
Pawan
Ganesh Mudavath
|

Updated on: Apr 23, 2022 | 4:21 PM

Share

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏలూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా చింతలపూడి(Chintalapudi) నియోజవర్గం మట్టంగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు కాకొల్లు బాబురావు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో అప్పులపాలైన బాబురావు ఇటీవల ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాబురావు మృతి తర్వాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ.లక్ష ఆర్ధిక సహాయం అందించారు. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.7 లక్షల నష్టపరిహారం అందేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవిందరావుకు సూచించారు.

అంతకుముందు ఏలూరు జిల్లాకు వచ్చిన పవన్ కల్యాణ్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పవన్‌ పరామర్శించారు. మృతుని భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

ఇవీ చదవండి

Also Read: Bandi Sanjay: భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దుః బండి సంజయ్ 

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి