AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దుః బండి సంజయ్

తెలంగాణ వేడెక్కింది. వరుస ఘటనలతో కుదుపునకు లోనైంది. నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. స్టేట్ వర్సెస్ సెంట్రల్ నిధులు పంచాయితీ హైఓల్టేజ్ క్రియేట్ చేసింది.

Bandi Sanjay: భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దుః బండి సంజయ్
Bandi Sanjay
Balaraju Goud
|

Updated on: Apr 23, 2022 | 1:56 PM

Share

Bandi Sanjay Kumar: తెలంగాణ(Telangana) వేడెక్కింది. వరుస ఘటనలతో కుదుపునకు లోనైంది. నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. స్టేట్ వర్సెస్ సెంట్రల్ నిధులు పంచాయితీ హైఓల్టేజ్ క్రియేట్ చేసింది. రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర(Praja Sangrama Padayatra) నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పాలనపై, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. నిజాం కాలంలో రజాకార్లు బయటకు వస్తే మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లన్న బండి సంజయ్.. ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.

చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ కిష్టంపల్లె స్టేజీ వద్ద 100కి.మీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేసి తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో బీజేపీ కీలక పాత్ర పోషించిందని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదన్న బండి సంజయ్, ఎంతో మంది తెలంగాణా బిడ్డల ఆత్మ బలిదానాల వల్ల స్వరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సుష్మాస్వరాజ్ కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే బీజేపీ ఇస్తుందని సుష్మాస్వరాజ్ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని బండి సంజయ్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రో ధరలు అత్యధికం ఎందుకు ఉన్నాయో చెప్పాలన్నారు. చమురుపై కేంద్రం రెండు సార్లు ఎక్సైజ్‌ సుంకం తగ్గించిందన్నారు. 18 రాష్ట్రాలు స్థానికంగా విధించే పన్నులను తగ్గించాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా తగ్గించలేదన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక వ్యాట్‌ నాలుగు శాతం పెంచారని బండి సంజయ్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ పోరాట ఫలితంగానే బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై సంజయ్‌ స్పందించారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని.. దశాబ్దాల కాలం నాటి జాతీయ పార్టీలో నాయకుడిగా ఉంటున్నాని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు అనుభవిస్తున్న పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని సుష్మా స్వరాజ్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను తోక పార్టీతో పోల్చిన బండి సంజయ్‌.. ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోందని విమర్శించారు. భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్ మాటలను నమ్మొద్దని ఆయన సూచించారు.