Karnataka: నిప్పులు జల్లుకునే జాతర.. అగ్ని కేళి పేరుతో ఉత్సవాలు
కర్ణాటకలో(Karnataka) ఓ జాతర సందర్భంగా అక్కడి భక్తులు ఒకరిపై ఒకరు నిప్పుల వర్షం కురిపించుకున్నారు. భగభగ మండే కాగడాలు విసురుకున్నారు. ఇదేదో ఫైటింగ్ సీన్ కాదు.. అక్కడి ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తున్న తమ సాంప్రదాయమని...

కర్ణాటకలో(Karnataka) ఓ జాతర సందర్భంగా అక్కడి భక్తులు ఒకరిపై ఒకరు నిప్పుల వర్షం కురిపించుకున్నారు. భగభగ మండే కాగడాలు విసురుకున్నారు. ఇదేదో ఫైటింగ్ సీన్ కాదు.. అక్కడి ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తున్న తమ సాంప్రదాయమని చెబుతున్నారు. భక్తులు ఒకరిపై ఒకరు మండుతున్న కాగడాలు విసురుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral) గా మారాయి. కటీల్‌లోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో ‘తూత్తేధార’ లేదా ‘అగ్ని కేళి'(Agni keli) జరుపుకున్నారు అక్కడి భక్తులు. దీనిలో భాగంగా భగభగ మండుతున్న కాగడాలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ క్రీడను ప్రతి యేటా ఏప్రిల్ నెలలో ఎనిమిది రోజులపాటు జరుపుకుంటారు. జాతరలో రెండవ రోజున అగ్నిఖేళి నిర్వహిస్తారు. ఈ ఉత్సవం మేష సంక్రాంతి ముందు రోజు రాత్రి ప్రారంభమవుతుంది. ఉత్సవంలో పాల్గొనే భక్తులు రెండు సమూహాలుగా విడిపోతారు. ఈ రెండు గ్రూపులు పరస్పరం మండుతున్న కాగడాలను విసురుకుంటారు.
చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ జతర వేడుకల్లో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని చెబుతున్నారు భక్తులు. జాతరను చూసేందుకు సుదూర గ్రామాలకు చెందిన ప్రజలు కూడా భారీగా వస్తుంటారు. ఇకపోత, ఇక్కడి దుర్గాపరమేశ్వరి ఆలయం నందిని నదిలో ఒక ద్వీపం మధ్యలో ఉంటుంది.
Also Read
Rahul Gandhi: మోదీ సర్కారుపై విరుచుకపడ్డ రాహుల్ గాంధీ.. మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ..



