India Post: ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలా చేసినట్లయితే బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే..!

India Post: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతుండటంతో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ కస్టమర్లను టార్గెట్‌ చేసుకుని మోసగిస్తున్నారు మోసగాళ్లు. ఈ టెక్నాలజీ కాలంలో ప్రతి..

India Post: ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలా చేసినట్లయితే బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2022 | 3:26 PM

India Post: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతుండటంతో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ కస్టమర్లను టార్గెట్‌ చేసుకుని మోసగిస్తున్నారు మోసగాళ్లు. ఈ టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌లను ఆసరా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు మోసాలు, స్కామ్‌ల కోసం విస్తృతంగా ఉపయోగించబడతాయి. ఇదిలా ఉండగా మోసాల పట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఇండియా పోస్ట్ ప్రజలకు సూచించింది. PIB ఇండియా నుండి ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయంలో ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల బారిన పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో URLలు, వెబ్‌సైట్ లింక్‌లు భాగస్వామ్యం చేయబడతాయని PIB ట్వీట్‌లో పేర్కొంది. దీంతో పాటు ఈ లింక్‌పై క్లిక్ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని అడుగుతారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం పొందవచ్చని, వెంటనే క్లిక్‌ చేయాలని లింక్‌లను పంపుతుంటారు. అలాంటి లింక్‌లపై క్లిక్‌ చేసినట్లయితే మీ ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమవుతుందని ఇండియా పోస్ట్‌ హెచ్చరించింది.

బహుమతులు, బోనస్‌లు ఇవ్వడం లేదు..

ఇండియా పోస్టు నుంచి ఎలాంటి లింక్‌లను పంపడం అనేది ఉండదని, మీకు ఎటువంటి లింక్‌లు వచ్చినా నమ్మి మోసపోవద్దని సూచించింది. ఇండియా పోస్ట్‌ నుంచి బహుమతులు, సబ్సిడీ, బోనస్‌ లాంటివేమి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇండియా పోస్ట్ పేరుతో లింక్స్‌, URL లేదా వీడియో సందేశం వచ్చినట్లయితే, దానిని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదని సూచించింది.

సమాచారాన్ని పంచుకోవద్దు..

పుట్టినరోజు, ఖాతా నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన ప్రదేశం, ఆధార్ నంబర్, ఓటీపీ వంటి సమాచారాన్ని షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోస్టల్‌ అధికారులు. ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Honda Bikes: హోండా కంపెనీ కీలక నిర్ణయం.. త్వరలో సరి కొత్త బైక్‌లు.. పెట్రోల్‌ ధరల నుంచి విముక్తి పొందవచ్చు!

EV Battery Safe Tips: ఈ టిప్స్‌ పాటించండి.. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి