Hyderabad: వామ్మో ఎంత పెద్ద కొండ చిలువ..! చూస్తేనే ఒళ్లు వణుకుపుట్టిస్తోంది..!
రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో తడిసి ముద్దవుతున్నాయి. రహదారులపై నీరు నిలిచి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దీనికి తోడు మరో పెద్ద సమస్య తయారైంది.
రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో తడిసి ముద్దవుతున్నాయి. రహదారులపై నీరు నిలిచి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దీనికి తోడు మరో పెద్ద సమస్య తయారైంది. చెరువులో, అడవుల్లో ఉండాల్సిన పాములు, మొసళ్లు వంటి జీవులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అసలే భారీ వర్షాలతో సతమతమవుతున్న జనాలు.. ఇలాంటి జీవుల వల్ల ఏదైనా అపాయం ఉంటుందేమో అని ప్రాణభయంతో బతుకుతున్నారు. దీంతో గంటల తరబడి రెస్క్యూ ఆపరేషన్ చేసి సంబంధిత అధికారులు వాటిని దూర ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కొండల సమీపంలో ఉన్న నివాసాల్లోకి ఎప్పుడు ఏ పాము వస్తుందో అని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హసన్ నగర్‌లో ఓ భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చిలువ జనావాసాల్లోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
హసన్ నగర్‌లోని ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన కొండచిలువను చూసిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో కొండచిలువను పట్టేందుకు స్నేక్ క్యాచర్‌ను రప్పించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ హకీమ్ మీర్ షెఖిల్ అలీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి భారీ కొండచిలువను పట్టుకున్నాడు. ఆ కొండచిలువ సుమారు 20 నుంచి 25 కిలోల వరకు బరువు ఉంటుందని తెలిపాడు. పట్టుకున్న కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేస్తానని, ఎవరికీ ఎలాంటి భయం అక్కర్లేదని చెప్పాడు. తాను 40 ఏళ్లుగా ఇలా పాములను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పట్టుకుంటానని, పాము కనిపిస్తే భయపడకుండా తనకు ఫోన్ చేయాలని కోరుతూ తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..