Hyderabad: జీహెచ్ఎంసీ చర్యలు.. విద్యుత్ దీప కాంతులతో వెలుగు విరజిమ్ముతున్న నగరంలోని పలు ప్రాంతాలు
Hyderabad: హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలు రాత్రి సమయంలో కూడా వెలుగులు విరజిమ్ముతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న డార్కు స్పాట్ లను గుర్తించి ప్రజలకు భద్రత సౌకర్యం..
Hyderabad: హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలు రాత్రి సమయంలో కూడా వెలుగులు విరజిమ్ముతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న డార్కు స్పాట్ లను గుర్తించి ప్రజలకు భద్రత సౌకర్యం కోసం జిహెచ్ఎంసి వీధి లైట్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చీకటి ప్రదేశాల్లో అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గుర్తించిన ప్రదేశాల్లో జిహెచ్ఎంసి అధికారులు వీధి లైట్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు నగర అభివృద్ధిలో భాగంగా పోలీస్ శాఖ.. జిహెచ్ఎంసి సమన్వయంతో కలిసి పని చేస్తున్నారు. ప్రజలు కోరిక మేరకు గానీ స్థానిక ప్రజా ప్రతినిధుల సూచన మేరకు సంబంధిత ప్రాంతాలను పరిశీలించి వీధి లైట్లను జీహెచ్ఎంసి నిధులతో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లలో సర్కిల్ వారీగా డార్కు స్పాట్స్ ల్లో ఇప్పటి వరకు 14,308 స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు. ఎల్.బి నగర్ జోన్ పరిధిలో 3743 బ్లాక్ స్పాట్ గుర్తించగా అక్కడ అన్ని ప్రదేశాలలో స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. అదే విధంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో 5 సర్కిల్ లో 1358, సికింద్రాబాద్ జోన్ లో 2665, చార్మినార్ జోన్ లోని 5 సర్కిల్ లో 3827 స్పాట్ లో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. శేరి లింగం పల్లి జోన్ లోని 5 సర్కిల్ లో 1312, కూకట్ పల్లి జోన్ లోని 5 సర్కిల్ లో 1403 డార్కు స్పాట్ లో ప్రజల సౌకర్యం కోసం వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసి అధికారులు చెప్పారు.