TTD Ticket Booking: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్లను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఎప్పుడంటే..
TTD Online Ticket Booking: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు కల. స్వామివారిని దర్శించుకుని..
TTD Online Ticket Booking: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు కల. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. ప్రతి రోజూ వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఆన్ లైన్ లోనే దర్శనం టికెట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ డిసెంబర్ నెలకు సంబందించిన కోటాని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను కూడా ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నామని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
Also Read: తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం .. దిగివచ్చిన టమాటా ధర..