AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pencil Robbery: పెన్సిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి.. రాజీ కుదిర్చిన పోలీసు.. ఫన్నీ వీడియో వైరల్ ఎక్కడంటే..

Pencil Robbery: నాని హీరోగా తెరకెక్కిన 'నేను లోకల్' మూవీలోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ కు ఓ చదువుకునే బుడ్డోడు నా పెన్సిల్ పోయింది కేసు పెట్టండి అంటే.. ఎక్కడికి  పోయింది అంటే...

Pencil Robbery: పెన్సిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి.. రాజీ కుదిర్చిన పోలీసు.. ఫన్నీ వీడియో వైరల్ ఎక్కడంటే..
Pencil Robbery
Surya Kala
|

Updated on: Nov 25, 2021 | 6:02 PM

Share

Pencil Robbery: నాని హీరోగా తెరకెక్కిన ‘నేను లోకల్’ మూవీలోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ కు ఓ చదువుకునే బుడ్డోడు నా పెన్సిల్ పోయింది కేసు పెట్టండి అంటే.. ఎక్కడికి  పోయింది అంటే.. చెక్కి చెక్కి.. పెన్సిల్ అరిగిపోయింది అన్న సీన్ తలచుకుని తలచుకుని ఇప్పటికీ నవ్వుకునేవారు ఉన్నారు. మరి అదే సీన్ నిజ జీవితంలో చోటు చేసుకుంది. రాయలసీమలోని ఓ స్టూడెంట్ నా పెన్సిల్ పోయింది.. కేసు పెట్టండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లాలోని పెద్ద కడుబూరు పోలీస్ స్టేషన్‌లో ఓ ఆరేళ్ళ స్టూడెంట్ తన పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేశాడు. అమాయకత్వం చురుకుదనం కలిసిన బాలుడు చెప్పిన మాటలకు పోలీసులు సరదాగా ఆ స్టూడెంట్స్ తో మాట్లాడి.. చివరికి రాజీ చేసి ఇద్దరినీ కలిపి పంపించారు. ఈ వీడియో ఇది నూతన రాయల సీమ అంటూ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పోలీసులకు ఓ బుడ్డోడు.. సార్ నా పేరు హన్మంతూ.. ఈడి పేరు కూడా హన్మంతే.. నా పెన్సిల్ దొంగతనం చేసిండు సార్..  దినాం దొంగతనం చేస్తుండు..  పెన్సిళ్లు అన్నీ ఎత్తుకుంటుండూ.. అని పోలీసులకు చెప్పాడు. అయితే నేను తీసుకుని ఇచ్చేసినా అంటూ మరో స్టూడెంట్ చెప్పాడు. దీంతో పోలీసులు ఇచ్చినాడు అంటగదరా అంటే.. లేదు సార్ ఇవ్వలేదు.. అంటే పోలీసులు మరి ఇప్పుడు ఏమి చేద్దాం అంటే.. వెంటనే హన్మంతు ఈడి మీద కేసు పెట్టండి . దినం పెన్సిల్ ఎత్తుకుంటున్నాడు. ఈడి అమ్మా, నాన్నలకు నేను చెప్తా.. కేసు పెట్టి జైల్లో పెట్టండి.. అంటూ బుడ్డోడు ముద్దుముద్దుగా పోలీసులతో మాట్లాడాడు..మీరిద్దరూ ఒక క్లాస్ ఏనా అడిగితే .. కాదు వీడు రామ స్కూల్.. నేను తిక్కన కాన్వెంట్ అంటూ చెప్పాడు. దీంతో పోలీసులు కేసు పెడితే.. వీడి అమ్మానాన్నాబాధపడతారు.. కదా ఈ ఒక్కసారికి పెద్ద మనస్సు చేసుకోరా.. రాజీ అవ్వండి వీడు జైలు కు పోతే బెయిలు కష్టమవుతదిరా అంటూ రాజీ కుదిర్చారు. ఇద్దరి చేయి చేయి కలిపి పోలీస్ స్టేషన్ నుంచి పంపించారు.

Also Read:   ఆ ప్రాంతంలో కరోనా కల్లోలం.. రానున్నది శీతాకాలం.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే లక్షలాది మంది మృతి అంటూ వార్నింగ్