Tomato Price Hike: తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం .. దిగివచ్చిన టమాటా ధర..
Tomato Price Hike: భారీ వర్షాలు, వరదలతో టమాటా పంట దిగుబడి తగ్గింది. అయితే టమాటా ఉన్న డిమాండ్ దృష్ట్యా టమాటా ధర చుక్కలను తాకుతుంది. దీంతో సామాన్యుడుఏమి కొనేటట్టు..
Tomato Price Hike: భారీ వర్షాలు, వరదలతో టమాటా పంట దిగుబడి తగ్గింది. అయితే టమాటా ఉన్న డిమాండ్ దృష్ట్యా టమాటా ధర చుక్కలను తాకుతుంది. దీంతో సామాన్యుడుఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు.. ప్రభుత్వాలు స్పందించి తమకు కూరగాయలను సబ్సిడీలో అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే మధ్య, సామాన్య తరగతివారికి ఊరటనిస్తూ.. తమిళనాడు సీఎం స్టాలిన్ ధరల కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
గత కొద్దీ రోజుల క్రితం కిలో టమాటా రూ. 30 నుంచి రూ. 60 వరకూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో టమాటా ధరలు పెట్రోల్, డీజిల్ తో పోటీ పడుతూ.. పెరుగుతుంది. నాలుగు రోజుల క్రితం కిలో టమాటా సెంచరీ దాటగా.. ఇప్పుడు డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర దాదాపు రూ. 150 కు చేరుకుంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల కిలో టమాటా రూ.100 నుంచి రూ.150 వరకూ అమ్ముతుంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు సంబంధించిన భారం ప్రజలపై పడకుండా స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంత్రి పెరియస్వామి ప్రకటన చేశారు. తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో కూరగాయల దిగుబడి తగ్గిందని. దీంతో ధరలు పెరిగిపోయాయని చెప్పారు.
అయితే సీఎం స్టాలిన్ కూరగాయల ధరలు నియంత్రించాలని ఆదేశించడంతో చర్యలు తీసుకున్నామని మంత్రి పెరియస్వామి చెప్పారు. ముఖ్యంగా టమాటా ధరలు మరింతగా పెరగవచ్చునని తెలియడంతో.. మహారాష్ట్ర నుంచి టమాటాలు దిగుమతి చేసుకున్నామని… ఇప్పటికే పలు దుకాణాల ద్వారా కిలో టమాటా రూ. 79 లకు అమ్మేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా టమాటా ధరలు ఓ రేంజ్ లో పెరిగాయి. వర్షాలు, వరదల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో.. టమాటా దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో పొరుగురాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్రలోని షోలాపూర్, కర్ణాటకలోని చిక్ బుల్లాపూర్ టమాటా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో భవిష్యత్ లో టమాటా ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.