AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat non-veg Row: గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మాంసాహారుల ఫైర్.. కారణం తెలిస్తే షాక్!

గుజరాత్‌లో నాన్‌ వేజ్‌ రగడ మొదలయింది. అమ్మకాలపై కొత్త ఆంక్షలు విధించడంతో వ్యాపారులు సైతం ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాన్‌వేజ్‌ అమ్మకాలు నిర్వహించరాదని ఆదేశాలు జారి చేశారు.

Gujarat non-veg Row: గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మాంసాహారుల ఫైర్.. కారణం తెలిస్తే షాక్!
Gujarat Non Veg Ban
Balaraju Goud
|

Updated on: Nov 25, 2021 | 6:19 PM

Share

Gujarat non-veg Row: గుజరాత్‌లో నాన్‌ వేజ్‌ రగడ మొదలయింది. అమ్మకాలపై కొత్త ఆంక్షలు విధించడంతో వ్యాపారులు సైతం ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాన్‌వేజ్‌ అమ్మకాలు నిర్వహించరాదని ఆదేశాలు జారి చేశారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకున్నా.. లోకల్‌ బాడీ వ్యవస్థలు మాత్రం కొత్త జీవోలను జారీ చేస్తున్నాయి. అనుమతి లేకుండా షాపులను ఏర్పాటు చేసిన వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఉన్న ఫలంగా షాపులను ఎత్తుకెళ్తున్నారు. దీనిపై ఫుట్‌పాత్ వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్‌ రాష్ట్రంలో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా రచ్చ నడుస్తోంది. మాంసాహార వంటలను స్నాక్స్‌ను అమ్మే రోడ్డుపక్క బండ్లు షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అయితే.. గుజరాత్ రాష్ట్రం మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న ప్రధాన లక్ష్యంతోనే అధికార పార్టీ ఈ ఆలోచన చేసిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆహారమన్నది వ్యక్తిగత ఇష్టం. ఎవరు ఏ ఆహారం తీసుకుంటారన్నది పూర్తిగా వాళ్ల అభిరుచిపై ఆధారపడి ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అయితే.. గుజరాత్‌లోని స్వాధ్యాయ పరివార్ స్వామి నారాయణ్ సంస్ధల ముసుగులో వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ సంస్థలకి తోడుగా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కలవడంతో వ్యాపారులకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. వడోదర, రాజ్ కోట్, జూనాగడ్, భావ్ నగర్ మున్సిపాలిటి ప్రాంతాల్లో నాన్‌వేజ్‌ అమ్మే షాపులపైన రోడ్డు పక్కన మాంసాహార వంటకాలను అమ్మే బండ్లపైన వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. మాంసాహారం అమ్మే వాళ్లు భయంతో తమ వ్యాపారాలను మూసేసుకున్నారు. వరుసదాడుల కారణంగా చికెన్, మటన్, ఫిష్ ప్రాన్ లాంటి వంటకాలను అమ్మే షాపులు పెద్దగా కనిపించడం లేదు. తాజా పరిమాణాలతో మాంసాహార ప్రియులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మున్సిపాలిటి ప్రాంతాల్లో అనధికారికంగా మాంసాహారం అమ్మే దుకాణాలపై దాడులు జరుగుతున్నాయని మాంసాహార విక్రయాలను నిషేధించారని జనాలు ప్రభుత్వంతో మొత్తుకున్నా పట్టించుకోవటంలేదు.

మాంసాహార అమ్మకాలపై నిషేధమంతా పూర్తిగా అనధికారికంగానే జరుగుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. ఈ వ్యవహారంపై నాన్‌వేజ్‌ ప్రియులు మండిపడుతున్నారు. మరోవైపు, మాంసాహారాన్ని విక్రయించే బండ్లు, స్టాల్స్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ కొంతమంది వీధి వ్యాపారులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రెస్టారెంట్ యజమానులు, సంపన్నులు, నాన్-వెజ్ ఆహార పదార్థాలను విక్రయించడానికి అనుమతిస్తున్నారని, పేద వీధి వ్యాపారులపై నిషేధ అంక్షలు ఏమిటని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు.

Read Also…  Karnataka Medico Students: ఫ్రెషర్స్ పార్టీ తెచ్చిన తంట.. కరోనా బారిన పడ్డ 66 మంది మెడికల్ కాలేజ్ విద్యార్థులు!